News


టాటా-జీఐసీ నుంచి జీఎంఆర్‌కు రూ.2,000 కోట్ల రుణం

Friday 10th January 2020
Markets_main1578627324.png-30814

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.2,000 కోట్ల రుణం సమీకరించింది. టాటా సన్స్‌, సింగపూర్‌ వెల్త్‌ ఫండ్‌ జీఐసీ నుంచి ఈ రుణాన్ని సేకరించినట్టు సమాచారం. ఇప్పటికే ఉన్న రుణాలను తగ్గించుకోవడానికి ఈ నిధులను వినియోగించనుంది. ప్రస్తుతం సంస్థకు రూ.20,000 కోట్లకుపైగా అప్పులున్నాయి. కాగా, హాంకాంగ్‌కు చెందిన ఈఎస్‌ఆర్‌ కేమాన్‌ అనుబంధ కంపెనీతో జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఏరోట్రోపోలిస్‌ జేవీ ఏర్పాటు చేసింది. ఈ జేవీ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సిటీలో రూ.550 కోట్లతో 66 ఎకరాల్లో లాజిస్టిక్స్‌, ఇండస్ట్రియల్‌ పార్కును అభివృద్ధి చేయనుంది. 



You may be interested

అపోలో మ్యునిక్‌ ఇకపై హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో హెల్త్‌

Friday 10th January 2020

కొనుగోలును పూర్తి చేసిన హెచ్‌డీఎఫ్‌సీ న్యూఢిల్లీ: హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సేవల్లో ఉ‍న్న అపోలో మ్యునిక్‌ కొనుగోలును ఆర్థిక సేవల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ పూర్తి చేసింది. ఈ సంస్థలో అపోలో హాస్పిటల్స్‌ గ్రూపునకు ఉన్న 50.80 శాతం వాటాను రూ.1,485 కోట్లకు, అలాగే, ఉద్యోగుల వద్దనున్న 0.36 శాతం వాటాను రూ.10.67 కోట్లకు కొనుగోలు చేసింది. అపోలో మ్యునిక్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు నియంత్రణ సంస్థల ఆమోదం లభించడంతో ఈ లావాదేవీని పూర్తి

భారత్‌ బ్యాంకింగ్‌ రుణ వృద్ధి అంతంతే!

Friday 10th January 2020

- 2019-2020లో వృద్ధిరేటు కేవలం 5 శాతం - ప్రపంచబ్యాంక్‌ అంచనా - 2020-21లో 5.8 శాతానికి పెరిగే అవకాశం - 2020లో ప్రపంచ ఆర్థికవృద్ధి 2.5 శాతమే! వాషింగ్టన్‌: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019 ఏప్రిల్‌-2020 మార్చి) 5 శాతానికి పడిపోయే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్‌ అంచనావేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-2021)లో వృద్ధిరేటు 5.8 శాతానికి రికవరీ అయ్యే అవకాశం ఉందని కూడా విశ్లేషించింది.

Most from this category