News


లినెన్‌ రిటైల్‌లోకి ‘లినెన్‌ హౌజ్‌’

Tuesday 10th September 2019
news_main1568092737.png-28284

  • ఏడాదిలో 100 స్టోర్ల ఏర్పాటు
  • విస్తరణకు రూ.50 కోట్లు వ్యయం

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- లినెన్‌ వస్త్రాలు, దుస్తుల విక్రయంలోకి కొత్త బ్రాండ్‌ లినెన్‌ హౌజ్‌ ఎంట్రీ ఇస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో దసరాలోగా 10 స్టోర్లను తెరుస్తున్నట్టు లినెన్‌ హౌజ్‌ను ప్రమోట్‌ చేస్తున్న కాకతీయ ఫ్యాబ్రిక్స్‌ డైరెక్టర్‌ వొజ్జా తిరుపతి రావు సోమవారం తెలిపారు. బ్రాండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా డైరెక్టర్లు అవిరినేని శ్రీకాంత్‌, త్రిపురనేని విజయ్‌, ఉప్పలపాటి కళ్యాణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘ఫ్రాంచైజీ భాగస్వామి రూ.10-15 లక్షల పెట్టుబడి పెడితే చాలు. రూ.50 లక్షల వరకు విలువైన సరుకును కంపెనీయే సరఫరా చేస్తుంది. వ్యాపారులకు 35 శాతం మార్జిన్‌ ఉంటుంది. ఏడాదిలో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించడం ద్వారా 100 ఔట్‌లెట్ల స్థాయికి చేరాలని కృతనిశ్చయంతో ఉన్నాం. ఇందులో భాగంగా రూ.50 కోట్ల దాకా వెచ్చిస్తాం. ప్రస్తుతం లినెన్‌ ఫియెస్టా, లినెన్‌ మాయెస్ట్రో, లినెన్‌ ఓసియన్‌, బాలేశ్వర్‌ సింథటిక్స్‌, ప్యూర్‌ఫైన్‌ ఫ్యాబ్రిక్స్‌ కంపెనీలతో చేతులు కలిపాం. ఆదిత్య బిర్లా, రేమండ్స్‌, సియారామ్స్‌తో చర్చిస్తున్నాం. టాప్‌ బ్రాండ్ల లినెన్‌ ఉత్పత్తులన్నీ విక్రయిస్తాం. ధరల శ్రేణి రూ.399తో మొదలై రూ.9,999 వరకు ఉంటుంది’ అని వివరించారు. 



You may be interested

మ్యూచువల్‌ ఫండ్‌ ఏయూఎంలో 4 శాతం పెరుగుదల

Tuesday 10th September 2019

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఆగస్టులో రూ.25.47 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం నెలతో పోల్చితే 4 శాతం వృద్ధి నమోదైంది. ఈక్విటీ, లిక్విడ్‌ స్కీమ్‌లలో పెట్టుబడుల వరద పెరిగిన కారణంగా ఈమేరకు వృద్ధి పెరిగిందని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వివరించింది. గతనెల్లో రూ.1.02 లక్షల కోట్ల ఇన్‌ఫ్లో నమోదైంది. ఈ మొత్తంలో లిక్విడ్‌ ఫండ్స్‌ వాటా రూ.79,000 కోట్లు కాగా, ఓపెన్-ఎండ్ ఈక్విటీ

బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆర్థిక ప్యాకేజీ

Tuesday 10th September 2019

ఆర్థిక శాఖా పరిశీలనలో ఉంది కేంద్ర మంత్రి మేఘ్‌వాల్‌ కోచి: నిధుల్లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్నట్టు కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌మేఘ్‌వాల్‌ తెలిపారు. భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థల శాఖా మంత్రి అయిన ఆయన సోమవారం కోచి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని, అదే ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రాధాన్య అంశమని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రభుత్వం

Most from this category