News


పన్ను భారం తగ్గిస్తే పెట్టుబడులు వస్తాయి

Wednesday 6th November 2019
news_main1573012223.png-29382

  • క్యాపిటల్‌ మార్కెట్లపై ఎస్‌టీటీ, సీజీటీ, స్టాంప్‌డ్యూటీ, జీఎస్‌టీల భారం
  • దీంతో వర్ధమాన మార్కెట్లతో పోటీపడలేని పరిస్థితి
  • ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ లిమాయే

ముంబై: బహుళ పన్నుల భారంతో మన క్యాపిటల్‌ మార్కెట్లు పోటీపడలేకపోతున్నాయని, పెట్టుబడుల రాకను పెంచేందుకు ప్రభుత్వం వీటిని తగ్గించాలని ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌ విక్రమ్‌ లిమాయే కోరారు. క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీలపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ), మూలధన లాభాల పన్ను (సీజీటీ), స్టాంప్‌ డ్యూటీ చార్జీలు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అన్నవి భారత్‌ వర్ధమాన మార్కెట్లతో పోడీపడే విషయంలో విఘాతం కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీ వృద్ధి ఆరేళ​ కనిష్ట స్థాయికి చేరి, మందగమనం ఎదుర్కొంటున్న తరుణంలో విక్రమ్‌ లిమాయే ఈ సూచనలు చేయడం గమనార్హం. ‘‘పన్నుల నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడం అన్నది మన మార్కెట్ల ఆకర్షణీయతను గణనీయంగా పెంచుతుంది. మరింత మంది పెట్టుబడులు పెట్టడం వల్ల లిక్విడిటీ కూడా మెరుగుపడుతుంది’’ అని ఎన్‌ఎస్‌ఈ 25 ఏళ్ల ప్రయాణం సందర్భంగా మంగళవారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లిమాయే అన్నారు. అదే సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలో చిన్న వ్యాపారులకు నిధుల అవసరం ఉంటుందని, వీరి ఆకాంక్షలు నెరవేరాలంటే పెద్ద ఎత్తున ఇన్వెస్టర్ల అవసరం ఉందన్నారు. ‘‘భారత మార్కెట్ల పోటీ తత్వాన్ని పెంచేందుకు మొత్తం మీద లావాదేవీల వ్యయాలు (పన్నులు సహా), మార్జిన్లు, నిబంధనల అమలు వ్యయాలు తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి, సెబీ చైర్మన్‌ను కోరుతున్నాను. అంతర్జాతీయంగా భారత వెయిటేజీ పెరిగేందుకు ఇది సాయపడుతుంది. దీంతో మరిన్ని విదేశీ పెట్టుబడులను మన మార్కెట్లు ఆకర్షించగలవు’’ అని లిమాయే ప్రకటన చేశారు. ఇనిస్టిట్యూషన్ల ప్రాతినిధ్యాన్ని పెంచడం ముఖ్యమన్నారు. ‘‘ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌, కార్పొరేట్‌ బాండ్ల మార్కెట్లో ఇనిస్టిట్యూషన్ల ప్రాతినిధ్యంపై సమగ్ర సమీక్ష చేపట్టాలి. తద్వారా నియంత్రణ, రిస్క్‌ అంశాలను మరింత సమన్వయం చేయడం ద్వారా పెన్షన్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ మరింతగా వీటిల్లో పాల్గొనేందుకు వీలుంటుంది’’ అని లిమాయే సూచించారు.
జన్‌ధన్‌ యోజన తరహా పథకం కావాలి...
సామాన్యులు సైతం షేర్లలో ట్రేడ్‌ చేసుకునేందుకు గాను డీమ్యాట్‌ ఖాతాల ప్రారంభానికి ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన తరహా పథకం అవసరమని విక్రమ్‌ లిమాయే అన్నారు. అప్పుడు బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబర్‌ సాయంతో ఇన్వెస్టర్లు ఖాతాను తెరిచేందుకు వీలుంటుందన్నారు. బ్యాంకు ఖాతాల్లేని కోట్లాది మందికి జీరో బ్యాలన్స్‌తో ఖాతా తెరిచేందుకు గాను మోదీ సర్కారు జన్‌ధన్‌ యోజన పథకాన్ని గతంలో ప్రవేశపెట్టగా, అది విజయవంతమైన విషయం తెలిసిందే. You may be interested

నష్టాలతో ప్రారంభం

Wednesday 6th November 2019

 ఏడు రోజుల ర్యాలీకి క్రితం రోజు బ్రేక్‌వేసిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం సైతం నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 110 పాయింట్ల నష్టంతో 40,140 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 11,900 పాయింట్ల దిగువన 11,889 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

టెక్‌ మహీంద్రా లాభం రూ.1,124 కోట్లు

Wednesday 6th November 2019

6 శాతం వృద్ధి  5 శాతం వృద్ధితో రూ.9,070 కోట్లకు ఆదాయం  రూ.671 కోట్లతో బార్న్‌ గ్రూప్‌ కొనుగోలు  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.1,124 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం(రూ.1,064 కోట్లు)తో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించామని టెక్‌ మహీంద్రా  ఎమ్‌డీ, సీఈఓ సీపీ గుర్నాని తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.8,630

Most from this category