News


వెలుగు రేఖ కనిపించింది.. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది

Friday 28th February 2020
news_main1582864237.png-32156

వేదాంత చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌
దేశంలో అపారంగా సహజ వనరులు
వెలికితీసేందుకు ప్రోత్సహించాలని సూచన

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ 11 ఏళ్ల కనిష్ట స్థాయి నుంచి త్వరలోనే పుంజుకుంటుందని మైనింగ్‌ దిగ్గజం, వేదాంత చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. కార్పొరేట్‌ పన్నును భారీగా తగ్గించినందున అది పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అలాగే, మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున చేసే పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చెందుతుందని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలపై వ్యయాలతోపాటు, దేశంలో దాగి ఉన్న సహజ వనరులను వెలికితీసే విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. అలాగే, అధిక శాతం ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని పరిశీలించాలని కూడా సూచించారు. ప్రభుత్వరంగ కంపెనీలు స్వతంత్రంగా పనిచేయగలిగితే ప్రస్తుత స్థాయికి మూడు రెట్లు అధికంగా ఉత్పత్తి చేయగలవన్నారు. ‘‘ఆర్థిక వ్యవస్థ తిరిగి అధిక వృద్ధి బాట పడుతుంది. సొరంగం చివర్లో వెలుగును నేను చూశాను. ఇది ఎంతో దూరంలో లేదు’’ అని అనిల్‌ అగర్వాల్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జీఎస్‌టీ ప్రభావం తాత్కాలికమేనని, ఇది గాడిన పడినట్టు చెప్పారు. గతేడాది జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 4.5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. వృద్ధి రేటుకు ప్రోత్సాహకంగా కేంద్రం కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం గమనార్హం. 
నిబంధనల అడ్డు తొలగించాలి...
ప్రపంచంలో తక్కువ పన్ను రేట్లు ఉన్న భారత్‌ పెట్టుబడులకు సహజ గమ్యస్థానమని అనిల్‌ అగర్వాల్‌ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో వ్యాపారాలు చేయాలనుకునే వారికి భారత్‌ ఉత్తమ ప్రదేశంగా పేర్కొన్నారు. ‘‘ప్రపంచంలో ఎక్కడైనా ఓ ప్రాజెక్టును ఆరంభిస్తే అది పూర్తయ్యేలా ప్రభుత్వం భరోసానిస్తుంది. కానీ, భారత్‌లో ఒంటరిగా వదిలేస్తారు. పర్యావరణ నిబంధనలకుతోడు ఇతర నియంత్రణలన్నింటినీ తప్పకుండా సరళతరం చేయాలి’’ అని అగర్వాల్‌ కేంద్రానికి సూచించారు.  దేశంలో బంగారం, రాగి, చమురు, ఇతర ఖనిజాలు దండిగా ఉన్నాయని, ప్రభుత్వం వీటిని వేలం వేయాలని కోరారు. ఆయిల్‌, రాగి వంటి సహజ వనరులను వెలికితీసే కంపెనీలకు స్వేచ్ఛనివ్వాలని, దాంతో ఆయా కంపెనీలు ఉత్పత్తిని వేగంగా పెంచుతాయని, తద్వారా దిగుమతుల భారం తగ్గుతుందన్నారు. పర్యావరణాన్ని కాపాడినంత వరకు కంపెనీలను ఉత్పత్తికి అనుమతించాలని హితవు పలికారు. You may be interested

రూ.42,600 వద్ద స్థిరంగా పసిడి

Friday 28th February 2020

కరోనా వైరస్‌ వివిధ దేశాలకు విస్తరిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలినప్పటికీ బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. శుక్రవారం దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల పసిడి రూ.42,611.00 వద్ద  స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ నిన్నటితో పోలిస్తే 4 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,640.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. (గురువారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌

దేశవ్యాప్తంగా సగానికి పడిన చికెన్‌ అమ్మకాలు

Friday 28th February 2020

కరోనా వైరస్‌ వదంతులే కారణం తెలుగు రాష్ట్రాల్లో భిన్న పరిస్థితులు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా చికెన్‌ అమ్మకాలు నెల రోజుల్లో 50 శాతానికి పడిపోయాయి. ఫాం గేట్‌ ధర 70 శాతం తగ్గింది. చికెన్‌ తింటే కరోనా వైరస్‌ వస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని గోద్రెజ్‌ అగ్రోవెట్‌ ఎండీ బి.ఎస్‌.యాదవ్‌ తెలిపారు. వారానికి 6 లక్షల కోళ్లు విక్రయించేవారమని, నెల రోజుల్లో 40 శాతం అమ్మకాలు

Most from this category