News


ఎల్‌ఐసీకి అనిల్‌ అంబానీ గ్రూప్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దెబ్బ

Monday 30th December 2019
news_main1577683938.png-30524

లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మొండి బకాయిల కోసం కేటాయింపులు 30 శాతం పెరిగి రూ. 23760 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటించింది. రియల్టీ, లోన్లు, ఇతర ఆస్తుల్లో తమ పెట్టుబడుల సమీక్ష అనంతరం మొండిపద్దులకు కేటాయించిన మొత్తాలు పెరిగినట్లు తెలిసిందని కంపెనీ వెల్లడించింది. ఎల్‌ఐసీ నుంచి రుణాలు తీసుకున్న కంపెనీల్లో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ కంపెనీలున్నాయి. ఇవన్నీ డిఫాల్ట్‌ కావడంతో ఎల్‌ఐసీ నెత్తిన ప్రొవిజన్ల భారం పెరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఎల్‌ఐసీ జీఎన్‌పీఏలు 6.15 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు 0. 27 శాతానికి క్షీణించాయి. 2018-19 కాలానికి ముందస్తుగా సంస్థ రూ. 18195 కోట్ల ప్రొవిజన్లు కేటాయించింది.

 

రూపాయి లెక్కల్లో ఎన్‌పీఏలు రూ. 24777 కోట్లు కాగా, ఇందులో అనుమానాస్పద ఆస్తుల విలువ 16690 కోట్లు, నష్టపోయిన అసెట్స్‌ రూ. 6772 కోట్లు, నాణ్యత తక్కువ అసెట్స్‌ విలువ రూ. 1312 కోట్లు. ఎల్‌ఐసీ పెట్టిన పెట్టుబడులపై ఆర్జన అంతకుముందేడాదితో పోలిస్తే గతేడాది 7.71 నుంచి 7.59 శాతానికి పడిపోయింది. సంస్థ మొత్తం పెట్టుబడుల విలువ రూ. 29.84 లక్షల కోట్లుగా తెలిపింది. సంస్థ మొత్తం రుణాల విలువ రూ. 4 లక్షల కోట్లు. 



You may be interested

దేశీయంగా పసిడి స్వల్ప తగ్గుదల

Monday 30th December 2019

అయినా రూ.39వేల పైన ట్రేడింగ్‌ దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో సోమవారం ఉదయం పసిడి ఫ్యూచర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం కూడా పసిడికి ఫ్యూచర్ల ర్యాలీకి ప్రతికూలమైంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి రూ.39,067.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గతవారంలో కేవలం 4రోజుల ట్రేడింగ్‌ సెషన్లలోనే ఏకంగా రూ.1100లు ర్యాలీ చేసిన నేపథ్యంలో పసిడి ట్రేడర్లు

నేలచూపులతో ప్రిన్స్‌ పైప్స్‌ లిస్టింగ్‌

Monday 30th December 2019

10 శాతం తక్కువగా రూ. 160 వద్ద షురూ ఐపీవో ధర కంటే దిగువన ట్రేడింగ్‌ ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ ముగించుకున్న ప్రిన్స్‌ పైప్స్‌ అండ్‌ ఫిట్టింగ్స్‌ లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో నష్టాలతో లిస్టయ్యింది. ఐపీవో ధర రూ. 178తో పోలిస్తే 10 శాతం డిస్కౌంట్‌తో రూ. 160 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. వెరసి ఇష్యూ ధర కంటే రూ. 18 తక్కువలో లిస్టయ్యింది. తదుపరి ఎన్‌ఎస్‌ఈలో రూ. 175.50 వద్ద గరిష్టాన్ని

Most from this category