News


తగ్గనున్న ఎల్‌ఐసీ ఆధిపత్యం

Monday 14th January 2019
news_main1547450184.png-23568

మార్కెట్‌ వాటా 70 శాతం లోపునకు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా 70 శాతం లోపునకు పడిపోయింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎల్‌ఐసీ వాటా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 71.81 శాతం నుంచి 69.36 శాతానికి తగ్గింది. ఈ వివరాలను ఐఆర్‌డీఏ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా సంస్థల మార్కెట్‌ వాటా 30.64 శాతానికి పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా కంపెనీల వాటా 28.19 శాతంతో పోలిస్తే రెండు శాతానికి పైగా ఇవి వాటాను పెంచుకున్నాయి. నూతన వ్యాపార ప్రీమియం (కొత్త పాలసీల నుంచి) విభాగంలోనూ ప్రైవేటు కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. నూతన పాలసీల్లో 8.47 శాతం వృద్ధి నమోదు చేశాయి. అదే సమయంలో ఎల్‌ఐసీ కొత్త పాలసీల వృద్ధి 5.99 శాతంగా ఉంది. 2017-18లో జీవిత బీమా కంపెనీలు 2.81 కోట్ల కొత్త పాలసీలను జారీ చేశాయి. ఇందులో 2.13 కోట్ల పాలసీలు ఎల్‌ఐసీవి కావడం గమనార్హం. ప్రైవేటు సంస్థలు జారీ చేసిన పాలసీలు 68.59 లక్షలుగా ఉన్నాయి. పాత పాలసీల రెన్యువల్‌ ప్రీమియంలో ఎల్‌ఐసీ వాటా 72.31 శాతం నుంచి క్రితం ఆర్థిక సంవత్సరంలో 69.35 శాతానికి తగ్గింది.
ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌కు పరిమిత స్పందన
ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ ఇచ్చిన ఓపెన్‌ ఆఫర్‌ (వాటాల కొనుగోలు) ను మైనారిటీ వాటాదారుల్లో 22 శాతం మంది వినియోగించుకున్నారు. మెజారిటీ వాటాదారులు మాత్రం ఎల్‌ఐసీ యాజమాన్యంపై నమ్మకంతో ఆఫర్‌కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో షేరుకు రూ.61.73 చొప్పున మొత్తం 2,04,15,12,929 షేర్లకు ఎల్‌ఐసీ గత నెలలో ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఓపెన్‌ ఆఫర్‌కు ముందే ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ తన వాటాను 44 శాతానికి పెంచుకుంది.



You may be interested

దీర్ఘకాలం ఇన్వెస్ట్‌ చేయదలిస్తే...

Monday 14th January 2019

దీర్ఘకాలం ఇన్వెస్ట్‌ చేయదలిస్తే... ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఈక్విటీ దీర్ఘకాలంలో స్థిరమైన పనితీరు చూపించిన పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఈక్విటీ ఒకటి. మోస్తరు రిస్క్‌కు సిద్ధపడే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. 20 ఏళ్ల నుంచి ఈ పథకం పెట్టుబడులకు అందుబాటులో ఉన్నది. వార్షికంగా చూస్తే ఈ పథకం తన ప్రయాణాన్ని ప్రారంభించిన దగ్గర్నుంచి ప్రతీ ఏటా సగటున 23.9 శాతం చొప్పున ఇప్పటి వరకు రాబడులను అందించింది. ఈ పథకం

ఒక పెట్టుబడి రెండు ప్రయోజనాలు

Monday 14th January 2019

- పన్ను ఆదా కోసం చివరి నెలల్లో యోచన తగదు - ముందస్తు ప్రణాళికతో రెండిందాలా లాభం - పన్ను, ఆదాయాల పరంగా ప్రయోజనం - ఈక్విటీ అనుసంధాన పథకాలతోపాటు అందుబాటులో పలు సాధనాలు - దీర్ఘకాలిక వ్యూహంతోనే ఆర్థిక లక్ష్యాల సాధన శివరామ్‌ ఉద్యోగంలో చేరిన కొత్తలో... పదేళ్ల క్రితం సంప్రదాయ జీవిత బీమా పాలసీ తీసుకున్నాడు. ఏటా ప్రీమియం రూపంలో రూ.40,000 వేల వరకు చెల్లిస్తు‍న్నాడు. ఇటీవల గృహ రుణం తీసుకోవడంతో... జీవిత బీమా పాలసీ ప్రీమియం చెల్లించడం

Most from this category