News


ఎల్‌ఐసీ రికార్డు స్థాయి ఫలితాలు

Tuesday 2nd July 2019
news_main1562052713.png-26736

  • 2018-19లో నూతన ప్రీమియం ఆదాయం రూ.1.42 లక్షల కోట్లు
  • అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే 6 శాతం వృద్ధి

ముంబై: బీమా రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో మంచి పనితీరు ప్రదర్శించింది. ముఖ్యంగా తొలి ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల రూపంలో వచ్చేది) 5.68 శాతం వృద్ధితో రూ.1,42,191.69 కోట్లుగా నమోదైంది. కంపెనీ చరిత్రలో ఒక ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడాది ప్రీమియం ఆదాయం ఈ స్థాయిలో సాధించడం ఇదే అత్యధికం. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం ప్రీమియం ఆదాయం రూ.3,37,185.40 కోట్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.3,17,850.99 కోట్లతో పోలిస్తే 6.08 శాతం పెరిగింది. కంపెనీ స్థూల ఆదాయం రూ.5,60,784.39 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఇదే కాలంలో రూ.5,23,611.11 కోట్లతో పోలిస్తే 7.10 శాతం వృద్ధి చెందింది.  
- పెన్షన్‌, గ్రూపు సూపర్‌యాన్యుయేషన్‌ వ్యాపారం ద్వారా ఆదాయం రూ.91,179.52 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.82,807.83 కోట్లతో పోలిస్తే 10.11 శాతం వృద్ధి చెందింది.
- 2019 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ రూ.2,50,936.23 కోట్ల మేర పాలసీదారులకు పలు రూపాల్లో చెల్లింపులు చేసింది. అంతక్రితం ఇదే కాలంలో చేసిన రూ.1,98,119.83 కోట్లతో పోలిస్తే 26.66 శాతం పెరిగింది. 
- కార్పొరేషన్‌ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ 2017-18లో ఉన్న రూ.28,45,041.82 కోట్ల నుంచి 2018-19లో రూ.31,11,847.28 కోట్లకు పెరిగింది.  
- డిజిటల్‌ రూపంలో ప్రీమియం వసూళ్లు 60 శాతానికి చేరాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 38 శాతం అధికం.



You may be interested

గూగుల్‌పై విచారణకు సీసీఐ ఆదేశం

Tuesday 2nd July 2019

న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ ప్లాట్‌ఫాంపై పోటీ సంస్థలను అణగదొక్కేసే విధానాలకు పాల్పడుతోందంటూ టెక్ దిగ్గజం గూగుల్‌ మీద ఆరోపణలపై విచారణకు కాంపిటీషన్‌ కమిషన్ (సీసీఐ)ఆదేశించింది. 150 రోజుల్లోగా నివేదిక సమర్పించాలంటూ డైరెక్టర్ జనరల్ (డీజీ)కి సూచించింది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లలో తన సొంత యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేలా తయారీ సంస్థలతో గూగుల్ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. దీనివల్ల వాటికి పోటీ యాప్స్‌కు మార్కెట్లో స్థానం దొరకడం లేదంటూ వాటి తయారీ

తగ్గిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు

Tuesday 2nd July 2019

మారుతీ మినీ సెగ్మెంట్‌ 36.2 % క్షీణత 27 % తగ్గిన టాటా మోటార్స్‌ అమ్మకాలు న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తోంది. వరుసగా గతనెల్లోనూ ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయాలు క్షీణతను నమోదుచేశాయి. ఈ విభాగంలోనే మార్కెట్ లీడరైన మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) జూన్‌ దేశీ అమ్మకాలు ఏకంగా 15.3 శాతం తగ్గిపోయాయి. కంపెనీ మినీ సెగ్మెంట్‌ 36.2 శాతం క్షీణించింది. వినియోగదారుల సెంటిమెంట్‌ బలహీనపడిన నేపథ్యంలో

Most from this category