News


ఎల్‌ఐసీ లిస్టింగ్‌.. ఇప్పుడే కాదు!

Wednesday 30th October 2019
news_main1572417216.png-29231

ఛైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌
దేశీయ బీమా కంపెనీల్లో పెద్ద కంపెనీ, దేశీయ సంస్థాగత మదుపరుల్లో పెద్దదైన ఎల్‌ఐసీని లిస్టింగ్‌కు తెచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉందని సంస్థ ఛైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ చెప్పారు. ఎకానమీలో మందగమనం కొనసాగుతున్నా, బీమారంగం మాత్రం మంచి పనితీరు కనబరుస్తోందన్నారు.

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వివరించారు...

  •  జూలై చివరికి ఎల్‌ఐసీ ఏయూఎం విలువ రూ. 31 లక్షల కోట్లుంది. 
  •  ఈ ఏడాది ఈక్విటీల్లో ఎల్‌ఐసీ రూ. 33వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ మొత్తంమీద రూ.13వేల కోట్ల లాభం వచ్చింది. గతేడాది ఈక్విటీలపై రూ. 23వేల కోట్ల లాభం ఆర్జించింది.
  •  బీమారంగంలో విస్తరించేందుకు ఇంకా చాలా అవకాశాలున్నాయని, ఈ రంగంలో కన్సాలిడేషన్‌ చాలా దూరముంది. 
  •  మార్కెట్లో స్వల్పకదలికలను ఎల్‌ఐసీ పట్టించుకోదు, సంస్థ ఎప్పుడూ దీర్ఘకాలిక పెట్టుబడులే పెడుతుంది.
  •  ఒక షేరు పది, పదిహేనేళ్లలో మంచి రాబడినిస్తే మంచి రాబడినిచ్చినట్లే!
  •  ఇన్వెస్టింగ్‌కు ముందు కంపెనీ సొంతంగా అధ్యయనం జరుపుతుంది, త్రైమాసికానికి ఒకసారి పోర్టుఫోలియోను సమీక్షించుకుంటాము. 
  •  చాలా కంపెనీల బోర్డుల్లో తమకు స్థానం ఉంది, కానీ ఆయా కంపెనీల రోజువారీ కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోము.
  •  ఎల్‌ఐసీ పెట్టుబడుల్లో ఎక్కువమొత్తం డెట్‌ రంగంలో ఉన్నాయి. 
  •  కొత్తగా 16వేల మంది ఆఫీసర్లను నియమించుకునే యత్నాల్లో ఉన్నాము, కొత్త శాఖలేమీ ఏర్పాటు చేయాలనుకోవడం లేదు. 
  •  ఐడీబీఐ బ్యాంకు బ్రాంచ్‌లతో సంస్థకు చెందిన చిన్న చిన్న శాఖలను విలీనం చేస్తున్నాము. 
  •  ప్రైవేట్‌ బీమా కంపెనీలకన్నా ఎల్‌ఐసీ స్థిరత్వ నిష్పత్తి(స్థిరంగా కస్టమర్లను కొనసాగించడం) బలంగా ఉంది.
  •  ఇప్పటికీ తమ ఎండోమెంట్‌, టర్మ్‌ పాలసీలకు కస్టమర్లు వస్తున్నారు. యూలిప్స్‌కు దూరంగా ఉన్నాము, ఇకపై వీటిని కూడా అందిస్తాము. 



You may be interested

30,000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 30th October 2019

బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 30,000 పైన ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు వరుసగా రెండో రోజూ లాభాలతో 30,005.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంక్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ 244 పాయింట్ల(0.85శాతం) వరకు లాభపడి 30117.20 వద్ద

మూడోరోజూ నష్టాల్లో పసిడి

Wednesday 30th October 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర వరుసగా మూడోరోజూ నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో బుధవారం ఔన్స్‌ పసిడి రాత్రి అమెరికా ముగింపు(1,490.50)తో పోలిస్తే 2డాలర్ల నష్టంతో 1488.5డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి రాత్రి అమెరికాలో ఫెడ్‌ ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంకు కీలక వడ్డీరేట్లపై తన వైఖరి ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. మందగమనం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజపరిచేందుకు ఈ ఏడాదిలో ఫెడ్‌ వరుసగా మూడోసారి వడ్డీరేట్లను తగ్గించవచ్చని మార్కెట్‌

Most from this category