News


ఎల్‌ఐసీ ఈటీఎఫ్‌కి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, అనిల్‌ అంబానీ గ్రూప్‌ దెబ్బ..!

Friday 24th January 2020
news_main1579848249.png-31162

దేశంలో అతిపెద్ద రుణ పత్రాల కొనుగోలుదారుగా పేరుపొందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్‌ వద్దనున్న రూ.11,000 కోట్ల విలువైన బాండ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో డిఫాల్ట్‌ అయ్యాయి. ఎల్‌ఐసీ నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న హెచ్‌ఎఫ్‌ఎల్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్స్‌ ఫైనాన్స్‌, సింటెక్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన కంపెనీల కమర్షియల్‌ పేపర్లను రేటింగ్‌ సంస్థలు డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది.

లైఫ్, పెన్షన్ ఫండ్ల నుంచి డిహెచ్ఎఫ్ఎల్లో రూ .6,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎల్ఐసి కేటాయింపులు చేసింది. అయితే ఈ పేపర్లు జూన్‌లో డిఫాల్ట్‌గా మార్చబడ్డాయి. రిలయన్స్ క్యాపిటల్‌కు రూ.4వేల కోట్ల రుణాలివ్వడంతో ఆ మొత్తం 2019 సెప్టెంబర్‌లో ఎల్ఎ‌ఐసీకి ఎన్‌పీఏగా మారింది.  

దివాలా తీర్పును ఎదుర్కొంటున్న అనేక కంపెనీలకు ఎల్‌ఐసి గతంలో రుణాలిచ్చింది. వాటిలో అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఏబీజీ షిప్‌యార్డ్‌, అమ్టెక్‌ అటో, మందన ఇండస్ట్రీస్‌, జైపీ ఇన్ఫ్రాటెక్‌, జ్యోతిస్ట్రక్చర్స్‌, రైయిన్‌బో పేపర్స్‌, ఆర్చిట్‌ ఫార్మా కంపెనీలున్నాయి.

దేశంలో అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారుగా ఉన్న ఎల్‌ఐసీ  మొత్తం రుణాల విలువ రూ. 4 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం రూ .30 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులున్నాయి.

ఈ సెప్టెంబర్‌ క్వార్టర్‌ ముగింపు నాటికి మొత్తంగా రూ.22,553 కోట్ల విలువైన ఆస్తులు డౌన్‌గ్రేడ్‌ చేయబడ్డాయి. వీటిలో రూ .4,300 కోట్లు సబ్ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్ కావడం లేదా రేటింగ్ కంపెనీల ద్వారా డౌన్‌గ్రేడ్‌  తగ్గించబడ్డాయి. పెన్షన్, లైఫ్ ఫండ్ల నుండి రిలయన్స్ క్యాపిటల్‌లోకి పెట్టుబడులు వచ్చాయి.

ఎల్‌ఐసి స్థూల ఎన్‌పీఏలు ఆర్థిక సంవత్సరం 2019లో 6.23శాతం నుంచి 6.15శాతానికి తగ్గాయి. 2019 మార్చి 31 నాటికి ఎన్‌పిఎలు రూ.24,777 కోట్లుగా నమోదయ్యాయి. మొండిబకాయిలకు అధిక కేటాయింపులు కారణంగా నికర ఎన్‌పీఏలు 1.82 శాతం నుండి 0.27 శాతానికి తగ్గాయి. 


రియల్ ఎస్టేట్, రుణాలు, ఇతర ఆస్తులలో పెట్టుబడుల నాణ్యత, పనితీరును సమీక్షించిన తరువాత ఎల్ఐసి గత ఆర్థిక సంవత్సరంలో అనుమానాస్పద ఆస్తుల విలువ 25 శాతం పెరిగి రూ .25 వేల కోట్లకు పెరిగింది.గత కొన్నేళ్లుగా, ఎబిజి షిప్‌యార్డ్, అమ్టెక్ ఆటో మరియు జేపీ గ్రూప్ లాంటి రుణాలు అధిక కలిగిన కంపెనీలకు ఎల్‌ఐసి ఎక్స్‌పోజర్‌ చేసింది

ఈ నేపథ్యంలో స్టాక్‌ ఎక్స్‌ఛేంజీల్లో ట్రేడయ్యే ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ ఎక్చ్సేంజ్‌ ట్రేడ్‌ ఫండ్‌ స్కీము శుక్రవారం 21శాతం పతనమయ్యింది. ఉదయం 12 గంటల సమయానికి రూ.21.82 వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

రూ.40,000పైకి పసిడి

Friday 24th January 2020

 శుక్రవారం బంగారం ధర మరోసారి స్వల్పంగా పెరిగి రూ.40,000 పైకి చేరింది. దేశీయ ఎంసీఎక్స్‌లో  ఉదయం 11.30 గంటలకు  10 గ్రాముల పసిడి ధర  రూ.40036.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో కరోనా వైరస్‌ ప్రభావంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పసిడి కొనుగోలుపై దృష్టి పెట్టడంతో క్రితం రోజుతో పోలిస్తే పసిడి  ధర ఐదు డాలర్లు పెరగడంతో ఔన్స్‌ బంగారం ధర 15,60.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  చైనాలో

ఇకపైనా పెద్ద బ్యాంకులదే హవా?

Friday 24th January 2020

శ్రీ కార్తిక్‌ వెలమకన్ని, మార్కెట్‌ నిపుణులు, ఇన్వెస్టెక్‌  భారీ బ్యాలన్స్‌షీట్స్‌, రిస్క్‌లను తట్టుకునే సామర్థ్యం తదితర అంశాల నేపథ్యంలో పెద్ద బ్యాంకులకే ఆర్థిక వ్యవస్థ మద్దతిస్తున్న సంకేతాలున్నట్లు మార్కెట్‌ నిపుణులు(ఇన్వెస్టెక్‌) శ్రీ కార్తిక్‌ వెలమకన్ని పేర్కొంటున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో కన్సాలిడేషన్‌ కొనసాగుతుందని, దీంతో పెద్ద బ్యాంకులు.. మరింత పెద్ద బ్యాంకులుగా అవతరిస్తాయని అంచనా వేస్తున్నారు. దేశీ బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Most from this category