News


కేంద్రానికి రూ.2,611 కోట్ల డివిడెండ్‌

Saturday 28th December 2019
news_main1577505059.png-30487

  •  చెల్లించిన ఎల్‌ఐసీ 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా సంస్థ, ఎల్‌ఐసీ గత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.2,611 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఈ మేరకు చెక్కును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎమ్‌.ఆర్‌. కుమార్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌, ప్రత్యేక కార్యదర్శి దేబాశిష్‌ పాండాలు కూడా పాల్గొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ 10 శాతం వృద్ధితో రూ.53,214 కోట్ల మిగులు విలువను సాధించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది. ఈ ఏడాది నవంబర్‌ నాటికి పాలసీల సంఖ్య పరంగా ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా 76.28 శాతానికి పెరిగిందని పేర్కొంది. అలాగే తొలి ఏడాది ప్రీమియమ్‌ కూడా 71 శాతం పెరిగిందని వివరించింది. 



You may be interested

125 కోట్ల మందికి ఆధార్‌

Saturday 28th December 2019

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 125 కోట్ల మంది ప్రజలకు ఆధార్ ఉన్నట్లు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగించడం గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది. నిత్యం 3 కోట్ల పైచిలుకు ఆధార్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ అభ్యర్ధనలు నమోదవుతున్నాయని యూఐడీఏఐ తెలిపింది. అలాగే ఆధార్ వివరాల అప్‌డేట్ అభ్యర్ధనలు కూడా రోజుకు 3-4 లక్షల మేర వస్తున్నాయని వివరించింది.  సీఎస్‌సీల్లో మళ్లీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సేవలు

ఐటీ కంపెనీలకు ‘బోయింగ్‌’ షాక్‌!

Saturday 28th December 2019

బిలియన్‌ డాలర్ల వ్యాపారం ఆగిపోయే ప్రమాదం 737 మ్యాక్స్‌ విమాన తయారీని నిలిపివేయడం వల్లే న్యూఢిల్లీ: భారత ఐటీ కంపెనీలకు బోయింగ్‌ సంస్థ నుంచి వచ్చే వ్యాపారానికి గండి పడనుంది! ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్‌ నుంచి బిలియన్‌ డాలర్ల వ్యాపారం ఆగిపోయే ప్రమాదం పొంచి ఉంది. బోయింగ్‌ తన ప్రతిష్టాత్మక 737 మ్యాక్స్‌ సిరీస్‌ విమానాల తయారీని జనవరి నుంచి నిలిపివేయనుంది. టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌, సైయంట్‌, ఎల్‌అండ్‌టీ

Most from this category