News


ఎల్‌ఐసీ ఐపీఓ సరికాదు: ఫీల్డ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌

Saturday 8th February 2020
news_main1581134093.png-31617

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన విధంగా ఎల్‌ఐసీలోని కొంత వాటాను ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా విక్రయిస్తే... దాని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు కచ్చితంగా నష్టం వాటిల్లుతుందని నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ ఫీల్డ్‌ వర్కర్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎఫ్‌ఐఎఫ్‌డబ్ల్యూఐ) అభిప్రాయపడింది. వాటా విక్రయం కొంత భాగంతోనే పరిమితం కాకుండా, భవిష్యత్తులో మరింత వాటా ఇతరుల చేతికి వెళ్లే అవకాశం ఉందని ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి బి.రామ్‌కుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇపుడు ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు ఎల్‌ఐసీనే ఆదుకుంటోంది. అధిక వాటా ఇతరుల చేతికి వెళితే సంస్థ ఈ సత్తాను కోల్పోతుంది. సంస్థను కాపాడడం కోసం ఐపీఓను వ్యతిరేకిస్తున్నన్నాం’’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 



You may be interested

బైజుస్‌లో జనరల్‌ అట్లాంటిక్‌ పెట్టుబడులు

Saturday 8th February 2020

1,420 కోట్ల మేర పెట్టుబడులు !  న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ సంస్థ, బైజుస్‌ తన ప్రస్తుత ఇన్వెస్టర్లలో ఒకటైన జనరల్‌ అట్లాంటిక్‌  నుంచి భారీ మొత్తంలో నిధులను సమీకరించింది. ఎంత మొత్తంలో జనరల్‌ అట్లాంటిక్‌ ఇన్వెస్ట్‌ చేసింది బైజుస్‌ వెల్లడించలేదు. అయితే ఈ సంస్థ బైజుస్‌లో రూ.1,420 కోట్లు(20 కోట్ల డాలర్లు) మేర ఇన్వెస్ట్‌ చేసిందని సమాచారం. టైగర్‌ గ్లోబల్‌ కూడా ఇదే రేంజ్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటుందని సంబంధిత వర్గాలు

రూ.700 కోట్లు కట్టండి

Saturday 8th February 2020

అనిల్‌ అంబానీకి వ్యతిరేకంగా యూకే కోర్టు ఆదేశాలు లండన్‌: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీకి సంబంధించి చైనా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలకు గాను వ్యక్తిగత హామీ ఇచ్చిన ప్రమోటర్‌ అనిల్‌ అంబానీకి బ్రిటన్‌ హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆరు వారాల్లో 100 మిలియన్‌ డాలర్లు (రూ.700 కోట్లు) కోర్టులో డిపాజిట్‌ చేయాలని న్యాయమూర్తి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంకు ఆఫ్‌ చైనా ముంబై శాఖ, చైనా

Most from this category