News


36 శాతం పెరిగిన ఎల్‌ఐపీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభం

Monday 21st October 2019
news_main1571631555.png-29023

  • రూ.4,981 కోట్లకు పెరిగిన మొత్తం ఆదాయం 
  • నికర వడ్డీ ఆదాయం 16 శాతం వృద్ధి 

న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 36 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.563 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.768 కోట్లకు పెరిగిందని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.4,205 కోట్ల నుంచి రూ.4,981 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.1,047 కోట్ల నుంచి 16 శాతం వృద్ధితో రూ.1,213 కోట్లకు పెరిగిందని తెలిపింది. నికర వడ్డీ మార్జిన్‌ 2.41 శాతం నంఉచి 2.42 శాతానికి పెరిగిందని పేర్కొంది. 

సీక్వెన్షియల్‌గా చూస్తే, రుణ నాణ్యత తగ్గింది. ఈ క్యూ1లో 1.98 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 2.38 శాతానికి పెరిగాయని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌​ తెలిపింది. దీంతో కేటాయింపులు రూ.2,194 కోట్లకు పెరిగాయని పేర్కొంది. మొత్తం రుణాలు రూ.1.77 లక్షల కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.2.03 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపింది. 



You may be interested

ఈ స్టాక్స్‌ కొనొచ్చు

Monday 21st October 2019

బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌  ఏసీసీ:    కొనచ్చు; ప్రస్తుత ధర: రూ.1,553; టార్గెట్‌ ధర: రూ.1,900 ఎందుకంటే: ఈ సిమెంట్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నిర్వహణ పనితీరు అంచనాలకు అనుగుణంగానే ఉండగా, వ్యయాలు అంచనాలను మించి పెరగడంతో నికర లాభం అంచనాలను అందుకోలేకపోయింది. ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.3,464 కోట్లకు పెరిగింది. వర్షాలు ఎక్కువ కాలం కురియడం, బలహీన ఆర్థిక పరిస్థితుల కారణంగా

టెక్నాలజీని చెడుగా చూపించే ప్రయత్నాలు

Monday 21st October 2019

టెక్నాలజీ వారధిలా పనిచేస్తుంది: ప్రధాని మోదీ న్యూఢిల్లీ: టెక్నాలజీని చెడుగా చూపించే ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. తన అధికారిక నివాసంలో ఆదివారం ప్రధాని మోదీ ‘బ్రిడ్‌జిటల్‌ ఇండియా’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. ‘‘కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) వల్ల ప్రమాదాలు లేదా రోబోలు మానవులను మించిన మేథస్సును చూపిస్తే అన్న వాటిపై చర్చ కాదు కావాల్సింది.

Most from this category