STOCKS

News


ఎల్‌ఐసీ హౌసింగ్‌పై కేటాయింపుల ప్రభావం

Friday 31st January 2020
news_main1580444911.png-31360

  • రూ.602 కోట్లకు తగ్గిన నికర లాభం 
  • నికర వడ్డీ ఆదాయం 18 శాతం అప్‌

ముంబై: ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో స్వల్పంగా తగ్గంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.607 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్‌)ఈ క్యూ3లో రూ.602 కోట్లకు తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ సిద్ధారథ మొహంతి తెలిపారు.  మొత్తం ఆదాయం రూ.4,466 కోట్ల నుంచి రూ.5,006 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు...., 

రెట్టింపైన మొండి బకాయిలు...
స్టాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ3లో రూ.596 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.598 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 2.33 శాతం నుంచి 2.42 శాతానికి పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.1,043 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.1,228 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలు 1.25 శాతం నుంచి 2.73 శాతానికి పెరిగాయి. ఫలితంగా కేటాయింపులు రూ.1,555 కోట్ల నుంచి రూ.2,585 కోట్లకు ఎగిశాయి. 



You may be interested

సగానికి పడిపోయిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం

Friday 31st January 2020

హైదరాబాద్‌: డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ లాభం సగానికి తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3 కన్సాలిడేషన్‌ ఫలితాల్లో రూ.11 కోట్ల లాభాన్ని ఆర్జించగా.. గత ఆర్థికం ఇదే కాలంలో లాభం రూ.20 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం మాత్రం గతేడాది క్యూ3లో రూ.674 కోట్ల నుంచి ఈ క్యూ3 నాటికి రూ.727 కోట్లకు పెరిగింది. ఎబిటా రూ.34.12 కోట్లుగా ఉంది. పర్యావరణ సవాళ్లు ఉన్నప్పటికీ

బడ్జెట్‌ వేళ ఆప్షన్‌ వ్యూహాలు!

Friday 31st January 2020

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈదఫా నూతనంగా శనివారం బడ్జెట్‌ రోజున ట్రేడింగ్‌ జరపనున్నాయి. బడ్జెట్‌ రోజు సూచీల్లో ఆటుపోట్లు అధికంగా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్షన్‌ ప్లేయర్లు బడ్జెట్‌ రోజున అవలంబించాల్సిన కొన్ని వ్యూహాలను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి... 1. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌: నిఫ్టీ రాబోయే వారాల్లో 12500 పాయింట్ల దిశగా కదలవచ్చు. ఈ సమయంలో కాల్‌ రేషియో వ్యూహం అవలంబించడం ద్వారా లాభం పొందొచ్చు. ఇందులో ఫిబ్రవరి

Most from this category