News


ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ‘2020 హోమ్‌ లోన్‌’ ఆఫర్‌

Wednesday 15th January 2020
news_main1579059119.png-30933

ముంబై: ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ అయిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ‘2020 హోమ్‌లోన్‌ ఆఫర్‌’ను బుధవారం ఆవిష్కరించనుంది. దీని కింద గృహ రుణాలపై పలు ఆఫర్లను అందించనున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ‘నివాసం ఉన్నప్పుడే చెల్లించండి’ అనే పథకం కింద.. తీసుకున్న రుణానికి అసలును (ప్రిన్సిపల్‌) ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నప్పుడు లేదా రుణం జారీ చేసిన 48 నెలల తర్వాత (ఈ రెండింటిలో ఏది ముందయితే అది అమలవుతుంది) నుంచి చెల్లించే అవకాశాన్ని కంపెనీ ఇస్తోంది. ఈ కాలంలో రుణంపై వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈఎంఐలో వడ్డీతోపాటు, అసలు కూడా కొంత మొత్తం కలసి ఉంటుంది. ఇక నివాసానికి సిద్ధంగా ఉన్న ఇంటికి రుణం తీసుకుంటే రుణకాల వ్యవధిలో 6 ఈఎంఐలను సంస్థ రద్దు చేస్తుంది. 5వ ఏట, 10వ ఏట, 15వ ముగిసిన వెంటనే రెండేసి ఈఎంఐలను మాఫీ చేస్తుంది. ఈ ప్రయోజనం కోసం క్రమం తప్పకుండా రుణానికి ఈఎంఐలను చెల్లిస్తూ ఉండాలి. అలాగే, రుణం తీసుకున్న మొదటి ఐదేళ్లలోపు ఆ రుణాన్ని పూర్తిగా చెల్లించేయకూడదు. ఈ ఆఫర్‌ ఫిబ్రవరి 15 వరకు అమల్లో ఉంటుందని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. 



You may be interested

మైండ్‌ట్రీ ఆదాయం రూ.1,965 కోట్లు

Wednesday 15th January 2020

10 శాతం వృద్ధి  3 శాతం పెరిగిన నికర లాభం  న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ మైండ్‌ట్రీకి ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) డిసెంబర్‌ క్వార్టర్‌లో రూ.197 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.191 కోట్ల నికర లాభం ఆర్జించామని కంపెనీ సీఈఓ, ఎమ్‌డీ దేబాశిష్‌ చటర్జీ తెలిపారు. 3 శాతం వృద్ధి సాధించామని పేర్కొన్నారు. గత క్యూ3లో రూ.1,787 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ3లో 10 శాతం

చేతక్‌ ఎలక్ట్రిక్‌ @రూ.లక్ష

Wednesday 15th January 2020

ప్రారంభ ధర రూ. లక్ష  బుకింగ్‌ అమౌంట్‌ రూ. 2000 ఆన్‌లైన్‌లో అవకాశం ఫిబ్రవరి నెలాఖరు నుంచి డెలివరీలు ముంబై: ప్రముఖ వాహ‌న త‌యారీ కంపెనీ బజాజ్‌ ఆటో ఒకప్పటి తన ఐకానిక్‌ స్కూటర్‌ ‘చేతక్‌’ను మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నూతన తరానికి తగిన విధంగా ఈసారి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదలచేసింది. ఈ-స్కూటర్‌ ప్రారంభ ధర రూ. లక్ష కాగా, ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ప్రభుత్వం ఇస్తోన్న సబ్సిడీలు పోనూ ఇది ఎక్స్‌-షోరూం ధరని కంపెనీ వివరించింది.

Most from this category