News


లిబర్టీ స్టీల్‌ చేతిక ఆర్సెలర్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్లు

Tuesday 2nd July 2019
news_main1562051907.png-26732

  • మరో ఐదు సర్వీస్‌ సెంటర్లు కూడా లిబర్టీ పరం 
  • డీల్‌ విలువ రూ.5,782 కోట్లు 

న్యూఢిల్లీ: ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీకి చెందిన ఏడు స్టీల్‌ ప్లాంట్లను లిబర్టీ స్టీల్‌ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ ప్లాంట్లతో పాటు ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీకే చెందిన ఇటలీ, ఫ్రాన్స్‌ల్లోని ఐదు సర్వీస్‌ సెంటర్లను కూడా కొనుగోలు చేశామని లిబర్టీ స్టీల్‌ వెల్లడించింది. ఈ మొత్తం డీల్‌ విలువ రూ.5,782 కోట్ల(74 కోట్ల యూరోలు)ని భారత సంతతి లోహ సామ్రాట్‌ సంజీవ్‌ గుప్తాకు చెందిన లిబర్టీ స్టీల్‌ పేర్కొంది. 

ఏడు ప్లాంట్లలో 14,000 మంది ఉద్యోగులు...
చెక్‌ రిపబ్లిక్‌లోని ఓస్ట్రావ ప్లాంట్‌ను, రొమేనియాలోని గలాటి ప్లాంట్‌ను, ఉత్తర మాసిడోనియాలోని స్కోప్జే, ఇటలీలోని పియాంబినో, లగ్జెంబర్గ్‌లోని డ్యుడెలెంజ్‌, బెల్జియంలోని లీజ్‌ వద్ద గల రెండు ప్లాంట్లను ఆర్సెలర్‌ మిట్టల్‌ నుంచి కొనుగోలు చేశామని లిబర్టీ స్టీల్‌ పేర్కొంది. ఈ మొత్తం ఏడు ప్లాంట్లలో 14,000 మంది ఉద్యోగులున్నారని వివరించింది. 


టాప్‌ టెన్‌లో లిబర్టీ స్టీల్‌
ఈ ఐదు ప్లాంట్ల కొనుగోళ్లతో అంతర్జాతీయంగా అగ్రశ్రేణి పది కంపెనీల్లో ఒకటిగా లిబర్టీ స్టీల్‌ నిలిచింది.(చైనాను మినహాయించి) విస్తృతమైన తుది ఉక్కు ఉత్పత్తుల రేంజ్‌తో 18 మిలియన్‌ టన్నులకు మించిన ఉత్పత్తితో అంతర్జాతీయంగా టాప్‌ 10 కంపెనీల్లో ఒకటిగా నిలిచామని లండన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జీఎఫ్‌జీ అలయన్స్‌లో ఒక భాగమైన లిబర్టీ స్టీల్‌ పేర్కొంది. జీఎఫ్‌జీ అలయెన్స్‌ కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద డీల్‌ అని తెలిపింది. ఈ ప్లాంట్ల కొనుగోళ్లతో జీఎఫ్‌జీ అలయెన్స్‌ సిబ్బంది 30 దేశాల్లో 30,000కు విస్తరించినట్లవుతుందని పేర్కొంది.



You may be interested

ట్రిపుల్‌ ఐటీలో ఎస్‌బీఐ ఇంక్యుబేటర్‌

Tuesday 2nd July 2019

 ‘ఫెనాన్స్‌ ఎట్‌ ది డోర్‌స్టెప్‌’కు శ్రీకారం దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు రాయదుర్గం: ట్రిపుల్‌ ఐటీ– హైదరాబాద్‌ ప్రాంగణంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొదటిసారిగా స్టార్టప్‌ ఇన్‌క్యుబేటర్‌ సెంటర్‌ను ‘ఫైనాన్స్‌ ఎట్‌ ది డోర్‌స్టెప్‌’ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎస్‌బీఐ 64వ ఫౌండేషన్‌డే సందర్భంగా సోమవారం ఈ స్టార్టప్‌ లాంజ్‌ను ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పిజే నారాయణన్, ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌

ఆన్‌లైన్‌ ఆధ్యాత్మికం..

Tuesday 2nd July 2019

భారత్‌లో 30 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ ఆధ్యాత్మిక కంటెంట్‌కు డిమాండ్‌ అవకాశాలు అందుకుంటున్న కొత్త స్టార్టప్స్‌ న్యూఢిల్లీ: అందరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఆధ్యాత్మిక కంటెంట్‌కు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కొంగొత్త స్టార్టప్‌ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. భక్తులు, గురువులు, ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు మొదలైన వాటన్నింటినీ అనుసంధానిస్తూ, ఆయా వర్గాలకు అవసరమైన సేవలు అందించడంపై ఇవి దృష్టి పెడుతున్నాయి. దేశీయంగా మైమందిర్, ఆర్‌జ్ఞాన్, కాల్పనిక్‌ టెక్నాలజీస్‌ లాంటివి

Most from this category