News


మార్కెట్లోకి ‘ఎల్‌జీ’ సీలింగ్‌ ఫ్యాన్లు

Thursday 4th July 2019
Markets_main1562224722.png-26789

  • ప్రారంభ ధర రూ.13,990
  • వై-ఫైతో నియంత్రించగలిగిన టెక్నాలజీ

చెన్నై: దక్షిణ కొరియాకు చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జీ.. ‘సీలింగ్ ఫ్యాన్’ విభాగంలోకి ప్రవేశించింది. తొలుత చెన్నైలో విక్రయాలను ప్రారంభించింది. ప్రీమియం శ్రేణిలో మొత్తం ఐదు ఫ్యాన్లను ఇక్కడ విడుదల చేయగా.. వీటి ప్రారంభ ధర రూ.13,990గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. త్వరలోనే వీటిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ నోయిడాలోని ఎల్‌జీ ఇండియా ప్లాంట్‌లో వీటిని ఉత్పత్తి చేస్తోంది. వై- ఫై ఆధారంగా పనిచేసే ఈ ఫ్యాన్లలో అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ అనుకూల సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్నట్లు తెలియజేసింది. ఎల్‌జీ స్మార్ట్‌ థింక్‌ టెక్నాలజీ ఉన్నందువల్ల మొబైల్ ఫోన్‌ల ద్వారా ఫ్యాన్‌ను నియంత్రించవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా సంస్థ ప్రొఫెషనల్ ఆర్‌ఏసీ ఎయిర్‌కేర్ (ఓవర్సీస్ సేల్స్ & మార్కెటింగ్) సెజూన్ పార్క్ మాట్లాడుతూ.. ‘భారత వాతావరణానికి తగిన విధంగా ఈ ఫ్యాన్లను రూపొందించాం. వినియోగదారుల నుంచి వీటిపట్ల సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. 
ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫయర్లు విడుదల
గృహోపకరణాలు, ఎయిర్ సొల్యూషన్స్ విభాగంలో తన ఉనికిని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా.. ఈ ఏడాది ఆగస్టు నాటికి మినీ ఎయిర్ ప్యూరిఫైయర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. స్టెయిన్ లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంక్ కలిగిన ఏడు ఆర్‌ఓ వాటర్ ప్యూరిఫైయర్‌ మోడళ్లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. 



You may be interested

ఐపీఓ నిధులు.....నాలుగేళ్ల కనిష్టానికి

Thursday 4th July 2019

-ఈ ఏడాది తగ్గిన ఐపీఓల జోరు  -తొలి ఆరు నెలల్లో  8 ఐపీఓలు  -రూ.5,509 కోట్లు సమీకరణ  -ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)ల జోరు ఈ ఏడాది అర్థభాగంలో అంతంతమాత్రంగానే ఉంది. ఈ ఏడాది జనవరి-జూన్‌ కాలానికి 8 కంపెనీలు(ఇటీవలే ముగిసిన ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ను కూడా కలుపుకుంటే) రూ.5,509 కోట్లు సమీకరించాయి. ప్రతి ఏడాది తొలి ఆరునెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే  ఇది నాలుగేళ్ల కనిష్ట స్థాయి. 2015లో కూడా జనవరి-జూన్‌

జీఎస్‌టీ వ్యత్యాసాలను వార్షిక రిటర్నుల్లో చెప్పాల్సిందే

Thursday 4th July 2019

ఆర్థిక శాఖ స్పష్టీకరణ న్యూఢిల్లీ: జీఎస్‌టీకి సంబంధించి నెలవారీ అమ్మకాల రిటర్ను ఫారం, విక్రయ గణాంకాలకు మధ్య వ్యత్యాసాలు ఉన్న పక్షంలో వార్షికంగా దాఖలు చేసే ఫారంలో కచ్చితంగా వెల్లడించాల్సిందేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కట్టాల్సిన పన్ను బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. సాధారణంగా జీఎస్‌టీఆర్‌-1 కింద విక్రయ వివరాలు, జీఎస్‌టీఆర్‌-3బీ కింద అన్ని లావాదేవీలు, చెల్లింపుల వివరాలను సమగ్రంగా దాఖలు చేయాల్సి ఉంటోంది. అయితే, వార్షిక రిటర్ను

Most from this category