కంపెనీ డైరెక్టర్ల ఆస్తుల జప్తునకు అనుమతించాలి
By Sakshi

ముంబై: రుణాలను ఎగ్గొట్టే వారి విషయంలో మరిన్ని కఠిన చర్యలకు వీలు కల్పించాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం కేంద్ర ఆర్థిక మంత్రిని డిమాండ్ చేసింది. తీసుకున్న రుణాలను చెల్లించకుండా ముఖం చాటేసే కంపెనీల డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులను అనుమతించాలని బడ్జెట్ ముందస్తు వినతుల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రిని లేఖ రూపంలో కోరింది. ‘‘ఇచ్చిన రుణాలను తిరిగి వసూలు చేసుకునేందుకు వీలుగా చెల్లింపుల్లో విఫలమైన కంపెనీ డైరెక్టర్ల వ్యక్తిగత ఆస్తుల స్వాధీనానికి వీలు కల్పిస్తూ చట్టాలను రూపొందించాలి లేదా సవరించాలి. అలాగే, విస్తృత అధికారాలతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడంతోపాటు వసూళ్లను పెంచుకునేందుకు కఠినమైన చట్టాలను తీసుకురావాలి’’ అని బ్యాంకు ఉద్యోగుల సంఘం కోరింది. అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలను మూసేయాలని డిమాండ్ చేసింది.
ఐబీసీతో ఎగవేతదారులకు ప్రయోజనం!
దివాలా, బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ/దివాలా చట్టం)తో ఎగవేతదారులు సులభంగా బయటకు వెళ్లిపోతున్నారని, తద్వారా బ్యాంకులు భారీగా హేర్‌కట్ తీసుకోవాల్సి (ఇచ్చిన రుణంలో పెద్ద మొత్తం నష్టపోవడం) వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ఐబీసీ మొండి బకాయిల వసూళ్లకు బదులు పరిష్కారానికి అనుకూలిస్తోంది. కనుక పరిష్కార ప్రక్రియకు బదులు వసూళ్ల యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రుణాల మంజూరు వ్యవహారాలు చూసే, జారీ చేసిన రుణాలు ఏడాదిలోపు ఎన్పీఏలుగా మారితే, ఆ సందర్భాల్లో ఎండీలు/సీఈవోలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఇతర సీనియర్ ఉద్యోగులను బాధ్యులుగా, జవాబుదారీగా చేసేందుకు ఓ వ్యవస్థను తప్పకుండా అమల్లో పెట్టాలి’’ అని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తన లేఖలో కోరింది. పెరిగిపోతున్న ఎన్పీఏల నేపథ్యంలో మరిన్ని రుణ రికవరీ ట్రిబ్యునళ్లు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇన్ఫ్రా రంగానికి రుణాల కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కోరింది.
You may be interested
రేటింగ్ ఏజెన్సీలకు సెబీ కఠిన నిబంధనలు
Friday 14th June 2019ఎగవేతలపై ముందుగానే అప్రమత్తతకు వీలు న్యూఢిల్లీ: క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలకు సంబంధించి కఠిన నిబంధనలను సెబీ తీసుకొచ్చింది. పలు ఇనుస్ట్రుమెంట్ల డిఫాల్ట్ అవకాశాలను రేటింగ్ ఏజెన్సీలు ముందుగానే వెల్లడించాల్సి ఉంటుంది. రుణాల చెల్లింపుల్లో పలు కంపెనీలు విఫలమవుతున్న ఘటనలు పెరిగిపోవడంతో సెబీ కఠిన నిబంధనలు తీసుకొచ్చినట్టయింది. సెబీతో సంప్రదింపుల అనంతరం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ప్రతీ రేటింగ్ విభాగంలో డిఫాల్ట్ అయ్యే అవకాశాలపై ఓ ప్రామాణిక ఏకీకృత బెంచ్ మార్క్ ప్రమాణాలను
అపోలో హాస్పిటల్స్, అబాట్ భాగస్వామ్యం
Friday 14th June 2019హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హృదయ సంబంధ ముప్పులను ముందే గుర్తించేందుకు అపోలో హాస్పిటల్స్, అబాట్ డయాగ్నస్టిక్స్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా పేషెంట్లకు అబాట్ అభివృద్ధి చేసిన ట్రోపోనిన్-1 బ్లడ్ టెస్ట్ చేసి ఆ సమాచారాన్ని భద్రపరుస్తారు. హృదయ సంబంధ చికిత్సల విషయంలో ఇలా సమాచారాన్ని భద్రపర్చడం దేశంలో ఇదే తొలిసారి అని ఇరు సంస్థలు ప్రకటించాయి.