News


‘జెట్‌’ విక్రయంలో కదలిక!

Thursday 16th May 2019
news_main1557991766.png-25769

  • ఎస్బీఐ క్యాప్స్‌తో డార్విన్‌ గ్రూపు భేటీ
  • రూ.14,000 కోట్ల డీల్‌కు ప్రతిపాదన
  • తెరపైకి హిందుజా సోదరులు

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ కొనుగోలుకు ఆసక్తి చూపించిన డార్విన్‌ గ్రూపు బుధవారం ఎస్‌బీఐ క్యాప్స్‌తో భేటీ అయింది. జెట్‌ను అప్పులతో సహా సొంతం చేసుకునేందుకు రూ.14,000 కోట్లను ఇవ్వజూపినట్టు సమావేశం అనంతరం డార్విన్‌ గ్రూపు సీఈవో రాహుల్‌ గన్‌పులే తెలిపారు. ఆయిల్‌ అండ్‌గ్యాస్‌, హాస్పిటాలిటీ, రియల్టీ తదితర రంగాల్లో డార్విన్‌ గ్రూపునకు పెట్టుబడులున్నట్టు గ్రూపు తెలియజేసింది. ‘‘ఎస్‌బీఐ క్యాప్స్‌ మమ్మల్ని ఆహ్వానించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆస్తులు, అప్పుల వివరాలను సంపూర్ణంగా తెలుసుకోవాలనుకున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. జెట్‌ కోసం తాము ఈ నెల 8న బిడ్‌ వేసినట్టు గన్‌పులే ధ్రువీకరించారు. ఫైనాన్షియల్‌ బిడ్‌ సమర్పించే ముందు తగిన విచారణలు చేశామని, అయినప్పటికీ బయటకు వెల్లడి కాని మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకున్నట్టు చెప్పారు. ఏకీకృత ఒప్పందం కింద గత కాలపు అప్పులన్నీ తీసుకుంటామని, కొనుగోలుకు అవసరమైన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకుంటామని తెలిపినట్టు వెల్లడించారు. అయితే, ఎస్‌బీఐ క్యాప్స్‌ తమను నిధులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని కోరినట్టు చెప్పారు. ఎతిహాద్‌ను బోర్డులోకి తీసుకునేందుకు ఆ సంస్థతోనూ సంప్రదించినట్టు తెలిపారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని రుణదాతలు జెట్‌ ఎయిర్‌వేస్‌కు రూ.8,000 కోట్లకు పైగా రుణాలివ్వగా, వసూలు చేసుకోలేని స్థితిలో చివరికి రుణాలను ఈక్విటీగా మార్చుకుని కంపెనీలో మెజారిటీ (51 శాతం) వాటాదారులు అయిన విషయం తెలిసిందే. అనంతరం జెట్‌ ఎయిర్‌వేస్‌లో 75 శాతం వాటాను బ్యాంకుల తరఫున ఎస్‌బీఐ క్యాప్స్‌ అమ్మకానికి ఉంచింది. కంపెనీలో ప్రస్తుతం 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్‌తో పాటు మరో రెండు సంస్థల నుంచి బిడ్లు రాగా, ఎతిహాద్‌ బిడ్‌ షరతులతో కూడి ఉన్నట్టు గుర్తించింది.  
హిందుజాలను ఒప్పించే యత్నం?
జెట్‌ ఎయిర్‌వేస్‌కు రుణాలిచ్చిన సంస్థలు, ఎతిహాద్‌ కలసి హిందుజా గ్రూపును సంప్రదించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా వాటా తీసుకోవాలని కోరినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై హిందూజా సోదరులు ఎలాంటి హామీనీ ఇవ్వలేదు. ఎతిహాద్‌ ప్రతినిధులు తొలుత హిందుజా సోదరుల్లో గ్రూపు వ్యవహారాలు చూసే జీపీ హిందుజాను సంప్రతించారు. అయితే, భారత వ్యాపారాలను చూస్తున్న తమ్ముడు అశోక్‌ హిందుజాతో ఎతిహాద్‌ ప్రతినిధులను జీపీ హిందుజా మాట్లాడించారు. జెట్‌లో పెట్టుబడిపై హిందుజా గ్రూపు హామీ ఇవ్వలేదని ఓ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ తెలిపారు. అధికారికంగా చర్చలు ఆరంభం కాలేదని స్పష్టం చేశారు. 
ఏవియేషన్‌పై గతంలో హిందుజాల ఆసక్తి
ఆటోమోటివ్‌, ఆయిల్‌, స్పెషాలిటీ కెమికల్స్‌, మీడియా, ఐటీ, విద్యుత్‌, హెల్త్‌కేర్‌, రియల్‌ ఎస్టేట్‌ ఇలా పది వ్యాపారాల్లో హిందుజాలున్నారు. 2001లో ఎయిర్‌ ఇండియా కోసం హిందుజా గ్రూపు ఆసక్తి కూడా చూపించింది. టాటా సన్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా అప్పట్లో పోటీ పడ్డాయి. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో 26 శాతం వాటా పట్ల కూడా హిందుజా గ్రూపు గతంలో ఆసక్తి చూపించింది.  You may be interested

‘టాటా ఉప్పు’... కంపెనీ మారింది!!

Thursday 16th May 2019

గ్రూపు వినియోగ వస్తువుల వ్యాపారం పునర్వ్యవస్థీకరణ టాటా కెమికల్స్‌ ఆహారోత్పత్తులు గ్లోబల్‌ బెవరేజెస్‌కు ప్రతీ టాటా కెమికల్‌ షేరుకు 1.14 గ్లోబల్‌ బెవరేజెస్‌ షేర్లు న్యూఢిల్లీ: టాటా గ్రూపులో వ్యాపార పునర్వ్యవస్థీకరణ దిశగా ఓ కీలక నిర్ణయం జరిగింది. టాటా కెమికల్స్‌కు చెందిన ఆహారోత్పత్తుల వ్యాపారం టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌లో విలీనం కానుంది. ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఈ వ్యాపార విలీనం ఉంటుందని టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌ (టీసీఎల్‌) తెలిపింది. ప్రతీ టాటా

అమ్మకానికి తొలి యాపిల్ కంప్యూటర్‌

Thursday 16th May 2019

మే 16న ఆన్‌లైన్‌లో వేలం ప్రారంభం ధర రూ.2.81- 4.56 కోట్ల దాకా అంచనా న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ తొలినాళ్లలో తయారు చేసిన కంప్యూటరు అమ్మకానికి వస్తోంది. మే 16 నుంచి 24 దాకా ఆన్‌లైన్‌లో నిర్వహించే వేలంలో క్రిస్టీస్‌ సంస్థ దీన్ని విక్రయిస్తోంది. దీని ధర 4,00,000- 6,50,000 డాలర్ల దాకా (సుమారు రూ. 2.81 కోట్ల నుంచి రూ. 4.56 కోట్ల దాకా) పలకవచ్చని అంచనా వేస్తున్నారు. 1976లో

Most from this category