News


చిక్కుల్లో లక్ష్మీ విలాస్‌ బ్యాంకు!

Saturday 28th September 2019
news_main1569645448.png-28593

  • డైరెక్టర్లపై మోసపూరిత ఆరోపణలు
  • ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు

న్యూఢిల్లీ: మరో ప్రైవేటు బ్యాంకులో ముసలం మొదలైంది. చెన్నై కేంద్రంగా దక్షిణాదిలో ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించే లక్ష్మీ విలాస్‌ బ్యాంకు ఆరోపణల్లో చిక్కుకుంది. బ్యాంకు బోర్డు డైరెక్టర్లకు వ్యతిరేకంగా మోసం, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం అభియోగాలతో ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది. ‘‘ఢిల్లీ పోలీసు విభాగంలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం 2019 సెప్టెంబర్‌ 23న ఎల్‌వీబీ బోర్డు డైరెక్టర్లు, తదితరులపై మోసం, విశ్వాస ఘాతుకం, నేరపూరిత కుట్ర తదితర అభియోగాలతో కన్నాట్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది’’అంటూ ఎల్‌వీబీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. చట్టపరంగా తగిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ లిమిటెడ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసినట్టు వివరించింది. తాము చేసిన రూ.790 కోట్ల డిపాజిట్‌ను లక్ష్మీ విలాస్‌ బ్యాంకు దుర్వినియోగం చేసిందన్నది రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ ఆరోపణ. ‘‘రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ లిమిటెడ్‌ నిధులను చట్టవిరుద్ధంగా దుర్వినియోగం చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఎల్‌వీబీ కేంద్రంగా పనిచేసింది’’ అని ఫిర్యాదులో రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ ఆరోపించినట్టు సమాచారం. అయితే, బ్యాంకు డైరెక్టర్ల బోర్డు మొత్తంపై ఈ ఆరోపణలు చేసిందా లేక కొందరు డైరెక్టర్లపైనేనా అన్న స్పష్టత అయితే ఇంకా రాలేదు. ఇటీవలే పీఎంసీ బ్యాంకు ఒకటి సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ను లక్ష్మీ విలాస్‌ బ్యాంకు విలీనం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. విలీనానికి అనుమతి కోరుతూ ఈ సంస్థలు ఆర్‌బీఐ వద్ద దరఖాస్తు కూడా దాఖలు చేశాయి. తాజా పరిణామాలు విలీనంపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అయితే, రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ 2018 మే నెలలో మొదటిసారి ఈ అంశాన్ని లేవనెత్తిందని, విలీన చర్చలు ఆ తర్వాతే మొదలైనందున కేసు ప్రభావం విలీనంపై ఉండబోదన్న అభిప్రాయం బ్యాంకు వర్గాల నుంచి వ్యక్తమైంది. You may be interested

రాజీ లేని నాణ్యత వల్లే ఈ స్థాయి

Saturday 28th September 2019

పదేళ్లలోనే భారతీ సిమెంట్‌కు అగ్రస్థాయి సంస్థ ఛైర్‌ పర్సన్‌ వైఎస్‌ భారతి రెడ్డి వ్యాఖ్యలు నల్లలింగాయపల్లె (కమలాపురం): వినియోగదారుల ఆశీర్వాదాలే వ్యాపారానికి పునాదులని భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీసీసీపీఎల్‌) ఛైర్‌ పర్సన్‌ వైఎస్‌ భారతి రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలం నల్ల లింగాయపల్లెలో బీసీసీపీఎల్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీసీపీఎల్‌ భాగస్వామ్య సంస్థ వికా (ఫ్రాన్స్‌)

బ్రోకరేజిల టాప్‌ సిఫార్సులు!

Friday 27th September 2019

వివిధ అంతర్జాతీయ బ్రోకరేజిలు 6 లార్జ్‌క్యాప్‌ షేర్లను దీర్ఘకాలానికి కొనొచ్చని  సిఫార్సుచేస్తున్నాయి. అవి...  బ్రోకరేజి: క్రెడిట్‌ సూసీ భారతీ ఇన్ఫ్రాటెల్‌ స్టాక్‌పై ఔట్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ను క్రెడిట్‌ సూసీ ఇచ్చింది. ఈ స్టాకు టార్గెట్‌ ధరను రూ. 330 గా నిర్ణయించింది. తాజా దిద్దుబాటు తర్వాత ఈ స్టాక్‌ వాల్యుషన్‌ ఆకర్షణీయంగా ఉందని, టెలికాం సెక్టార్‌లో ఈ స్టాక్‌ను పరిశీలించవచ్చని సలహాయిచ్చింది. అంతేకాకుండా కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు వలన ఈ స్టాక్‌ ఈపీఎస్‌(షేరుపై లాభం) అంచనాలను 28శాతం

Most from this category