News


ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపార విక్రయం?

Friday 31st January 2020
news_main1580493668.png-31379

ఇంజనీరింగ్‌, సాఫ్ట్‌వేర్‌ సేవల ప్రముఖ కంపెనీ లార్సన్‌అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. లిస్డెడ్‌ కంపెనీ అయిన ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ పరిధిలో ప్రస్తుతం అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారం నడుస్తోంది. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌కు ప్రమోటర్‌ ఎల్‌అండ్‌టీయే. కంపెనీ నుంచి విస్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ఆధారంగా దీనిపై ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రధానం కాని వ్యాపార ఆస్తులను విక్రయించాలన్న కంపెనీ విధానంలో భాగమే ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపార విక్రయ ప్రతిపాదనగా ఆ వర్గాలు పేర్కొన్నాయి. కొనుగోలుదారును గుర్తించేందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు జేపీ మోర్గాన్‌ను కంపెనీ నియమించుకున్నట్టు తెలిపాయి. ఇదే తరహా ప్రయత్నం రెండేళ్ల క్రితం చేయగా, నాడు సఫలం కాలేదని పేర్కొన్నాయి.

 

‘‘దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారాన్ని పెద్ద సంస్థలే ఏలుతున్నాయి. ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్‌ వాటితో పోలిస్తే చిన్నది. పోటీ సంస్థల స్థాయిలో మార్కెట్‌ వాటా కలిగి లేదు. కనుక విక్రయించాలన్నది యోచన. ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణలో ఉన్న ఆస్తులు 2019 మార్చి నాటికి రూ.70,000 కోట్లు. విక్రయిస్తే నిర్వహణ ఆస్తుల విలువలో 5-6 శాతం సమకూరవచ్చు. అంటే రూ.3,500-4,200 కోట్లు. డీల్‌ను బట్టి ఇందులో మార్పు ఉండొచ్చు’’ అని ఆ కథనం పేర్కొంది. తమ ఆస్తులను పెంచుకోవాలన్న కాంక్షతో ఉన్న పోటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నుంచి, ప్రైవేటు ఈక్విటీ సంస్థల నుంచి మంచి స్పందన రావచ్చని అంచనా. ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణ ఆస్తుల పరంగా 12వ స్థానంలో ఉంది. 2019 సెప్టెంబర్‌ నాటికి మార్కెట్‌ వాటా 2.7 శాతంగా ఉన్నట్టు కేర్‌ డేటా ఆధారంగా తెలుస్తోంది. టాప్‌-5 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల చేతుల్లోనే (హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, ఎస్‌బీఐ, ఆదిత్యబిర్లా సన్‌లైఫ్‌, నిప్పన్‌ ఇండియా) 58.5 శాతం వాటా ఉండడం గమనార్హం.

 

ఎల్‌అండ్‌టీ గ్రూపు 2010లో మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఫిడెలిటీ మ్యూచువల్‌ ఫండ్‌ వ్యాపారాన్ని 2012 మేలో కొనుగోలు చేసింది. నాటి డీల్‌ విలువ రూ.55-600 కోట్లు. యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, నిప్పన్‌ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌, కోట్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పోటీ సంస్థలుగా ఉన్నాయి. 2019 సెప్టెంబర్‌ నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలో ఆస్తులు రూ.25.7 లక్షల కోట్లుగా ఉన్నాయి. పరిశ్రమలో మంచి వృద్ధి నెలకొన్నప్పటికీ.. ఈ వృద్ధికి తగ్గ అవకాశాలను అందుకోవడంలో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ పోటీపడలేకపోతున్నట్టు మార్కెట్‌ పరిస్థితులను గమనిస్తే తెలుస్తోంది. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ బ్యాలన్స్‌ షీట్లలో అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారాన్ని నాన్‌ ఫోకస్డ్‌ వ్యాపారంగానే పేర్కొనడం గమనార్హం. కనుక అప్రాధాన్య వ్యాపారం నుంచి తప్పుకోవాలన్నది కంపెనీ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. హౌసింగ్‌ ఫైనాన్స్‌, రూరల్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌లు కంపెనీ ప్రధాన వ్యాపారాలుగా ఉన్నాయి.



You may be interested

మార్కెట్లు పడతాయా.. పెరుగుతాయా..?

Friday 31st January 2020

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను శనివారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మార్కెట్‌ను ఉత్సాహపరిచే పలు చర్యలను బడ్జెట్లో ప్రకటించే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా. ద్రవ్యలోటు నిర్దేశిత లక్ష్య స్థాయిని మించినాకానీ, వృద్ధి రేటు పెంపే ప్రధాన కర్తవ్యం కావాలన్న ఆర్థిక సర్వే సూచనల నేపథ్యంలో ప్రభుత్వం బడ్జెట్లో కచ్చితంగా కొన్ని కీలక నిర్ణయాలకు చోటిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.   అయితే, బడ్జెట్‌ మార్కెట్‌ను షేక్‌

బడ్జెట్‌ ముందురోజు మార్కెట్‌ డీలా

Friday 31st January 2020

సెన్సెక్స్‌ 190 పాయింట్లు డౌన్‌ 74 పాయింట్లు నీరసించిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ పతనం ఆర్థిక సర్వే, సార్వత్రిక బడ్జెట్‌ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అయ్యాయి. చివరికి  ప్రస్తావించదగ్గ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించి 40,723 వద్ద నిలవగా.. నిఫ్టీ 74 పాయింట్ల వెనకడుగుతో 11,963 వద్ద స్థిరపడింది. ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. తదుపరి ఆటుపోట్లను చవిచూశాయి.

Most from this category