News


ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.2,560 కోట్లు

Thursday 23rd January 2020
news_main1579748576.png-31114

  • 15 శాతం వృద్ధి 
  • మొత్తం ఆదాయం రూ.36,718 కోట్లు


న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టూబ్రో(ఎల్‌ అండ్‌ టీ) ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.2,560 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం (రూ.2,219 కోట్లు)తో పోలిస్తే 15 శాతం వృద్ధి సాధించామని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. పన్ను వ్యయాలు 37 శాతం తగ్గడం, నిర్వహణ ఆదాయం పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.34,823 కోట్ల నుంచి రూ.36,718 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ కంపెనీ ఫలితాలు అంచనాల కంటే బలహీనంగా ఉన్నాయని నిపుణులంటున్నారు.
రూ.41,579 కోట్ల ఆర్డర్లు...
గ్రూప్‌ కంపెనీలన్నీ కలిపి రూ.41,579 కోట్ల ఆర్డర్లు సాధించాయి. వీటిల్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 43 శాతంగా ఉంది.  ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం చివరి నాటికి ఆర్డర్ల బుక్‌ 5 శాతం వృద్ధితో రూ.3,06,280 కోట్లకు పెరిగింది. ఇక ఈ క్యూ3లో నిర్వహణ లాభం 10 శాతం వృద్ధితో రూ.4,118 కోట్లకు పెరిగింది. గత క్యూ3లో 11 శాతంగా ఉన్న నిర్వహణ లాభ మార్జిన్‌ ఈ క్యూ3లో 11.30 శాతానికి పెరిగింది. గత ‍క్యూ3లో రూ.31,422 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు ఈ క్యూ3లో రూ.33,494 కోట్లకు పెరిగాయి. 

 

ఆర్డర్లు 10-12 శాతం పెరుగుతాయ్‌...
పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆర్డర్లు  10-12 శాతం, ఆదాయం 12-15 శాతం మేర వృద్ధి చెందగలవన్న అంచనాలను సాధించే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం. రానున్న క్వార్టర్లలో మౌలిక రంగ విభాగం పుంజుకోగలదని ఆశిస్తున్నాం. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న చర్యలు సానుకూలంగా ఉన్నాయి. రానున్న బడ్జెట్‌లో డిమాండ్‌ పెంచే మరిన్ని చర్యలను ప్రభుత్వం తీసుకోగలదని భావిస్తున్నాం. 

  • ఆర్‌. శంకర రామన్‌, సీఎఫ్‌ఓ, ఎల్‌ అండ్‌ టీ 



You may be interested

జీఎంఆర్‌ పోర్టు అదానీ చేతికి!

Thursday 23rd January 2020

హైదరాబాద్‌: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ ఆంధ్రప్రదేశ్‌లో మరో డీల్‌కు సిద్ధమైందని సమాచారం. కాకినాడలో నిర్మాణంలో ఉన్న కమర్షియల్‌ పోర్టుతోపాటు తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని కోన గ్రామంలో ఉన్న సెజ్‌ను జీఎంఆర్‌ గ్రూప్‌ నుంచి కొనుగోలు చేయనుంది. ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తున్నదీ త్వరలో వెల్లడి కానుంది. పోర్టు అభివృద్ధికే జీఎంఆర్‌ సుమారు రూ.3,000 కోట్లు ఖర్చు చేస్తోంది. కాకినాడ సెజ్‌ పరిధిలో 8,521

పన్ను మినహాయింపులు పొడిగించాలి

Thursday 23rd January 2020

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసిక కాలంలో భారీగా పతనమైంది. గత క్యూ3లో రూ.225 కోట్లుగా ఉన్న ఈ బ్యాంక్‌ నికర లాభం ఈ క్యూ3లో 69 శాతం పతనమై రూ.70 కోట్లకు తగ్గింది. మొండి బకాయిలు పెరగడంతో కేటాయింపులు కూడా బాగా పెరిగాయని, అందుకే నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తెలిపింది.  నికర వడ్డీ

Most from this category