News


ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.2,527 కోట్లు

Thursday 24th October 2019
news_main1571886838.png-29091

  • 13 శాతం వృద్ధి 
  • 3 లక్షల కోట్లు దాటిన ఆర్డర్‌ బుక్‌ 
  • ఈ క్యూ2లో 20 శాతం పెరిగిన ఆర్డర్లు 

న్యూఢిల్లీ: నిర్మాణ, ఇంజినీరింగ్‌ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 13 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.2,230 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.2,527 కోట్లకు పెరిగిందని ఎల్‌ అండ్ టీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.31,087 కోట్ల నుంచి రూ.35,925 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ క్యూ2లో రూ.4,021 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించామని, 11.4 శాతం నిర్వహణ లాభ మార్జిన్ సాధించామని పేర్కొంది. 

లక్ష్యాలు సాధిస్తాం.... ! 
ఈ క్యూ2లో ​‍గ్రూప్‌ కంపెనీల ఆర్డర్లు 20 శాతం వృద్ధితో రూ.48,292 కోట్లకు పెరిగాయని పేర్కొంది. వీటిల్లో 35 శాతం (రూ.16,675 కోట్లు) మేర అంతర్జాతీయ ఆర్డర్లు ఉన్నాయని తెలిపింది. ఈ క్యూ2లో వచ్చిన ఆర్డర్లతో కలుపుకొని ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి మొత్తం ఆర్డర్ల విలువ రూ.3,03,222 కోట్లకు ఎగసిందని తెలిపింది. దీంట్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 22 శాతమని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్డర్లు 10-12 శాతం, ఆదాయం 12-15 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యాలుగా నిర్దేశించుకున్నామని, ఈ లక్ష్యాలను సాధించగలగమన్న ధీమాను కంపెనీ వ్యక్తం చేసింది. ఆర్డర్లు జోరుగా ఉండటం, పటిష్టమైన బ్యాలెన్స్‌ షీట్‌, వైవిధ్యమైన వ్యాపార విభాగాలు, ప్రాజెక్ట్‌ల అమలు... ఇవన్నీ తమ బలాలని, ఈ సానుకూలాంశాలతో ప్రస్తుతం దేశంలో నెలకొన్న మందగమన ఆర్థిక పరిస్థితులను తట్టుకోగలమన్న విశ్వాసాన్ని ఈ కంపెనీ వ్యక్తం చేసింది. 

 



You may be interested

ఇండియన్‌ బ్యాంక్‌ లాభం రెట్టింపు

Thursday 24th October 2019

మొత్తం ఆదాయం రూ.6,045 కోట్లు  నిలకడగా రుణ నాణ్యత న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రెండింతలు పెరిగింది. గతక్యూలో రూ.150 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.359 కోట్లకు పెరిగిందని ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.5,219 కోట్ల నుంచి రూ.6,045 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  తగ్గిన కేటాయింపులు... ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత నిలకడగా ఉంది. గత క్యూ2లో

ఇన్ఫీపై సెబీ విచారణ

Thursday 24th October 2019

సీఈవో మీద ఆరోపణలపై దృష్టి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ కోణంలోనూ దర్యాప్తు విచారణకు మేనేజ్‌మెంట్‌ను పిలిచే అవకాశం న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపించడంపైనా, సీఈవో.. సీఎఫ్‌వోలపై వచ్చిన ఆరోపణలమీద మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. షేరు ధరను ప్రభావితం చేసే కీలక సమాచారాన్ని ముందుగానే తెలియజేయకపోవడంపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం. అలాగే, కంపెనీ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఏదైనా జరిగిందా అన్న కోణాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు

Most from this category