News


ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,473 కోట్లు

Wednesday 24th July 2019
news_main1563950700.png-27273

  • 21 శాతం వృద్ధి
  • రూ.29,636 కోట్లకు నికర అమ్మకాలు 
  • రూ.2.9 లక్షల కోట్లకు ఆర్డర్‌ బుక్‌ 

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌ దిగ్గజం, ఎల్‌ అండ్‌ టీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,473 కోట్ల నికర లాభం(కన్సాలిటేడెట్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.1,215 కోట్లతో పోల్చితే 21 శాతం వృద్ధి సాధించామని ఎల్‌ అండ్‌ టీ తెలిపింది. నికర అమ్మకాలు 27,005 కోట్ల నుంచి కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.29,636 కోట్లకు పెరిగాయని ఎల్‌ అండ్‌ టీ కంపెనీ సీఈఓ ఆర్‌. శంకర్‌ రామన్‌ చెప్పారు. మొత్తం వ్యయాలు రూ.25,216 కోట్ల నుంచి రూ.27,365 కోట్లకు పెరిగాయని తెలిపారు. 

నిర్వహణ లాభం 20 శాతం అప్‌...
మొత్తం ఆదాయంలో దాదాపు సగం ఉండే మౌలిక రంగ సెగ్మెంట్‌ ఆదాయం 14 శాతం ఎగసి రూ.14,038 కోట్లకు పెరిగిందని రామన్‌ తెలిపారు. నిర్వహణ లాభం 20 శాతం వృద్ధితో రూ.3,319 కోట్లకు పెరిగిందని, నిర్వహణ లాభ మార్జిన్‌ 1 శాతం పెరిగి 11.2 శాతానికి చేరిందని పేర్కొన్నారు. విద్యుత్తు వ్యాపారం 48 శాతం తగ్గిందని, ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి ఈ వ్యాపారం పుంజుకోగలదని పేర్కొన్నారు. 
11 శాతం పెరిగిన ఆర్డర్లు...
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో తమ గ్రూప్‌ కంపెనీలన్నీ కలసి రూ.38,700 కోట్ల ఆర్డర్లు సాధించాయని రామన్‌ వెల్లడించారు. ఆర్డర్లు 11 శాతం వృద్ది చెందాయని పేర్కొన్నారు. మొత్తం ఆర్డర్లలో అంతర్జాతీయ ఆర్డర్లు రూ.9,0005 కోట్లు(23 శాతం)గా ఉన్నాయని వివరించారు. ఇక ఈ ఏడాది జూన్‌ 30 నాటికి మొత్తం ఆర్డర్లు రూ.2,94,014 కోట్లకు చేరాయని, వీటిల్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 21 శాతమని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆర్డర్లు 10-12 శాతం రేంజ్‌లో వృద్ధి చెందగలవని అంచనాలున్నాయన్నారు. 

క్యూ2 నుంచి మైండ్‌ట్రీ....
ఈ ఏడాది జూన్‌ నాటికి మైండ్‌ట్రీ కంపెనీలో తమకు 28.86 శాతం వాటా ఉందని, ఈ క్వార్టర్‌ పూర్తయిన తర్వాత ఆ కంపెనీలో తమ వాటా 60.59 శాతానికి చేరిందని రామన్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌ నుంచి తమ అనుబంధ సం‍స్థగా మైండ్‌ట్రీ కొనసాగుతుందని వివరించారు. తమ ఎలక్ట్రికల్‌, ఆటోమేషన​ విభాగాన్ని షిండర్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీకి విక్రయించామని, ఈ విక్రయానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌​ ఇండియా  ఆమోదం తెలిపిందని, ఈ విక్రయం మరో ఏడాదిలో పూర్తవుతుందని పేర్కొన్నారు. You may be interested

విదేశీ ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారు!

Wednesday 24th July 2019

జూలైలో 120 కోట్ల డాలర్ల విక్రయాలు దేశీయ మార్కెట్లో ఎన్నికల ముందు భారీ కొనుగోళ్లు జరిపిన విదేశీ సంస్థాగత మదుపరులు బడ్జెట్‌ అనంతరం భారీగా అమ్మకాలకు దిగారు. సూపర్‌రిచ్‌పై బడ్జెట్లో విధించిన సర్‌చార్జ్‌పై అసంతృప్తిగా ఉన్న ట్రస్ట్‌ స్ట్రక్చర్‌ ఎఫ్‌ఐఐలు విక్రయాలకు దిగారు. జూలైలో ఇంతవరకు ఎఫ్‌ఐఐలు దాదాపు 120 కోట్ల డాలర్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. ఇదే కొనసాగితే క్షీణత పరంగా గత అక్టోబర్‌ తర్వాత జూలై నెల

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,795 కోట్లు

Wednesday 24th July 2019

14 శాతం వృద్ధి 6 శాతం వృద్ధితో రూ.10,197 కోట్లకు నికర అమ్మకాలు  న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలివర్‌(హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.1,795 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.1,569 కోట్లతో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. అమ్మకాలు పెరగడం, మార్జిన్ల మెరుగుదల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో

Most from this category