News


ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.3,418 కోట్లు

Saturday 11th May 2019
news_main1557555964.png-25681

న్యూఢిల్లీ: ఇన్‌ఫ్రా దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి క్వార్టర్‌లో రూ.3,418 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) వచ్చింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) ఇదే క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం(రూ.3,167 కోట్లు)తో పోల్చితే 8 శాతం వృద్ధి సాధించామని ఎల్‌ అండ్ టీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.41,091 కోట్ల నుంచి రూ.45,555 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.18 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. 

ఈ ఏడాది మార్చినాటికి ఆర్డర్‌ బుక్‌ రూ.2,93,427 కోట​ఉలగా ఉందని, దీంట్లో అంతర్జాతీయ ఆర్డర్లు 22 శాతంగా ఉన్నాయని తెలిపారు. 

ఎన్నికలు జరుగుతున్నందున విధాన నిర్ణయాల్లో అవాంతరాలు ఏర్పడుతున్నాయని, ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో నిర్వహణ ఆంశాలపై  ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. మౌలిక రంగం జోరుగా వృద్ధి సాధిస్తోందని, పన్ను ఆదాయం పెరుగుతోందని, విమానాశ్రయాలు, రహదారులు తదితర రంగాల్లో పెట్టుబడులు పెరుగుతాయని వివరించారు. ఒత్తిడి వ్యాపారాలు రికవరీ బాటా పట్టడం, మొండి బకాయిల సమస్య తగ్గుముఖం పట్టటంతో లిక్విడిటీ సమస్య తగ్గి, బిజినెస్‌ సెంటిమెంట్‌ మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రుణ వృద్ధి మెరుగుపడటంతో రవాణా మౌలిక సదుపాయాలు, ​పర్యావరణ ఇంధన, కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌, డిజిటల్‌ టెక్నాలజీ, సర్వీసు రంగాల్లో ప్రైవేట్‌ పెట్టుబడులు పుంజుకోగలవని వివరించారు. 



You may be interested

తగ్గిన కెనరా బ్యాంకు నష్టాలు

Saturday 11th May 2019

మార్చి క్వార్టర్లో రూ.551కోట్లకు పరిమితం గణనీయంగా తగ్గిన మొండి బకాయిలు న్యూఢిల్లీ: కెనరా బ్యాంకు నష్టాలు మార్చి త్రైమాసికంలో చాలా వరకు తగ్గాయి. 2017-18 మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ.4,859 కోట్ల నష్టాలను ఎదుర్కోగా, 2018-19 మార్చి త్రైమాసికం నాటికి నష్టాలను రూ.551 కోట్లకు తగ్గించుకుంది. ఎన్‌పీఏలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు కారణమైంది. మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ.14,000 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో వచ్చిన రూ.11,555

పీవీఆర్‌ లాభం రెట్టింపు

Saturday 11th May 2019

క్యూలో రూ.48 కోట్లు నమోదు న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ ఆపరేటర్‌ పీవీఆర్‌ మార్చి త్రైమాసికం ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. సంస్థ లాభం రెట్టింపై రూ.47.75 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 40 శాతం పెరిగి రూ.846 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో లాభం రూ.26 కోట్లు, ఆదాయం రూ.592 కోట్లుగా ఉన్నాయి. ఎస్‌పీఐ సినిమాస్‌ను కొనుగోలు చేసినందున మార్చి త్రైమాసికం ఫలితాలను, 2018-19 ఆర్థిక సంవత్సరం ఫలితాలను అంతక్రితం

Most from this category