News


ఏజీఆర్‌ 'పరిష్కారం'పై వొడా-ఐడియా కసరత్తు..

Wednesday 19th February 2020
news_main1582081129.png-31907

  • టెలికం కార్యదర్శితో చైర్మన్ బిర్లా భేటీ

న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బాకీల కారణంగా దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్‌) .. ఈ సమస్య నుంచి గట్టెక్కడంపై కసరత్తు చేస్తోంది. కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా .. మంగళవారం కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సాగిన చర్చల్లో వొడాఫోన్ ఐడియా ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ కూడా పాల్గొన్నారు. అయితే, చర్చల సారాంశాన్ని వెల్లడించేందుకు బిర్లా నిరాకరించారు. "ఇప్పుడే ఏం చెప్పలేము" అంటూ భేటీ అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. వీఐఎల్ సంస్థ ఏజీఆర్‌ బాకీలు కట్టగలదా, దివాలా ప్రకటించే అవకాశం ఉందా వంటి ప్రశ్నలకు ఆయన సమాధానమివ్వడానికి నిరాకరించారు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాలంటూ టెలికం శాఖ డిమాండ్ చేస్తోంది. వీఐఎల్ సుమారు రూ. 53,000 కోట్లు కట్టాల్సి ఉంది. బాకీల చెల్లింపుల్లో ఆదేశాల ఉల్లంఘనపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మిగతా టెల్కోలతో పాటు వీఐఎల్‌ సోమవారం రూ. 2,500 కట్టింది. మరో వారం రోజుల్లోగా ఇంకో రూ. 1,000 కోట్లు కడతామని పేర్కొంది. మరోవైపు, బాకీలు కట్టని టెల్కోల బ్యాంకు గ్యారంటీలను స్వాధీనం చేసుకోవాలని టెలికం శాఖ భావిస్తోంది. అదే జరిగితే వీఐఎల్ వంటివి మూతబడే ప్రమాదముంది. బాకీలపై వెసులుబాటు లభించకపోతే మూసివేత తప్పదంటూ బిర్లా గతంలోనే వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఫండ్స్‌కు వీఐఎల్‌ కష్టాలు...
వీఐఎల్‌లో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్‌.. ఈ నష్టాల ప్రభావం మిగతా పోర్ట్‌ఫోలియోపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తాజాగా యూటీఐ ఎంఎఫ్‌, నిప్పన్ ఇండియా సంస్థలు మొత్తం పోర్ట్‌ఫోలియో నుంచి వీఐఎల్ షేర్లను విడదీసి ప్రత్యేకంగా పక్కన పెట్టాయి. అయిదు స్కీమ్‌ల నుంచి వీఐఎల్ షేర్లను విడదీసినట్లు యూటీఐ ఏఎంసీ తెలిపింది. వీఐఎల్ డెట్ సాధనాల్లో ఈ అయిదు స్కీమ్‌ల కింద యూటీఐ దాదాపు రూ. 186 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. మరోవైపు, నిప్పన్ ఇండియా.. తమ మూడు స్కీమ్‌ల నుంచి వీఐఎల్ సెక్యూరిటీలను విడదీసింది. ఈ సంస్థ దాదాపు రూ. 227 కోట్ల మేర వీఐఎల్‌ డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టింది. ఆరు స్కీమ్‌ల ద్వారా వీఐఎల్‌ సాధనాల్లో దాదాపు రూ. 2,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎంఎఫ్ ఇప్పటికే ఆ షేర్లను పక్కకు తీసి పెట్టింది. 



You may be interested

హీరో మోటోకార్ప్‌ భారీ విస్తరణ ప్రణాళికలు

Wednesday 19th February 2020

వచ్చే 5-7 ఏళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడి న్యూఢిల్లీ: దేశీ ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌.. భారీ విస్తరణ ప్రణాళికలను చేపట్టనుంది. ప్రత్యామ్నాయ వాహన పరిశోధన- అభివృద్ధి, స్థిర ఉత్పాదక సౌకర్యాల ఏర్పాటు, నెట్‌వర్క్ విస్తరణ, ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌ను విస్తరింపచేయడం వంటి అంశాలపై తాజాగా దృష్టిసారించింది. ఇందు కోసం వచ్చే 5-7 ఏళ్లలో రూ. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్

మళ్లీ పేలనున్న సెల్‌బాంబ్‌ ..!

Wednesday 19th February 2020

రూ.300కు చేరనున్న ఏఆర్‌పీయూ  అప్పుడే కంపెనీలకు దండిగా లాభాలు భారీ బకాయిలు కట్టేందుకు తప్పని చార్జీల పెంపు ఇప్పటికే గత డిసెంబర్‌లో 42 శాతం వరకు పెంపు మొబైల్‌ చార్జీలకు మళ్లీ పూర్వపు రోజులు న్యూఢిల్లీ: టెలికం సేవల మార్కెట్లోకి రిలయన్స్‌ జియోతో ఎక్కువగా మురిసిపోయింది సగటు వినియోగదారుడేనని అనడంలో సందేహం లేదు. కానీ, మారిన పరిస్థితులతో ఇప్పుడు అదే వినియోగదారుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితి...! కేంద్రానికి భారీ బకాయిలు కట్టాల్సి ఉన్న టెలికం కంపెనీలు ఎయిర్‌టెల్‌,

Most from this category