News


రిటైల్‌ మార్కెట్లోకి కేపీఆర్‌ గ్రూప్‌

Saturday 21st September 2019
news_main1569041644.png-28463

ఆర్గానిక్‌ ఇన్నర్‌వేర్‌ ‘ఫాసో’ విడుదల
రూ.3,450 కోట్ల టర్నోవర్‌ అంచనా
కొత్త ప్లాంటు తెలుగు రాష్ట్రాల్లో..?
హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- వివిధ రంగాల్లో ఉన్న తమిళనాడుకు చెందిన కేపీఆర్‌ గ్రూప్‌ కంపెనీ కేపీఆర్‌ మిల్‌.. ఫాసో పేరుతో సొంత బ్రాండ్‌లో లోదుస్తుల విభాగంలోకి ప్రవేశించింది. భారత్‌లో తొలిసారిగా నూరు శాతం ఆర్గానిక్‌ కాటన్‌తో వీటిని తయారు చేశారు. ఇటీవలే తమిళనాడు, కేరళలో ఫాసో ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వీటిని అందుబాటులోకి తెచ్చింది. వచ్చే ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా ఫాసో అడుగు పెడుతుందని కేపీఆర్‌ మిల్‌ ఈడీ ఇ.కె.శక్తివేల్‌ శుక్రవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. 2021లో మహిళలు, పిల్లల లోదుస్తుల తయారీలోకి వస్తామన్నారు. ఆ తర్వాతి ఏడాది నుంచి సొంత స్టోర్లను ప్రారంభిస్తామన్నారు. ఫాసో ధరల శ్రేణి రూ.139-1,199 మధ్య ఉంది.
విస్తరణకు రూ.400 కోట్లు...
కేపీఆర్‌ మిల్‌కు భారత్‌తోపాటు ఇథియోపియాలో అంతర్జాతీయ స్థాయిలో 12 ప్లాంట్లున్నాయి. 60 దేశాల్లోని 40 ప్రముఖ కంపెనీలకు వివిధ బ్రాండ్లలో లోదుస్తులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నట్టు కంపెనీ ఎండీ పి.నటరాజ్‌ తెలిపారు. ‘రోజుకు 2,75,000 కిలోల యార్న్‌, 50,000 కిలోల ఫ్యాబ్రిక్‌, 60,000 కిలోల ప్రాసెసింగ్‌ సామర్థ్యం ఉంది. రూ.400 కోట్లతో విస్తరణ చేపట్టాం. విస్తరణ పూర్తి అయితే విభాగాన్నిబట్టి తయారీ సామర్థ్యం 50 శాతం వరకు పెరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్‌ టర్నోవర్‌ రూ.4,000 కోట్లు. ఇందులో టెక్స్‌టైల్‌ విభాగం వాటా రూ.3,016 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం టర్నోవరులో 15 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. 
పరిశ్రమ రూ.30,000 కోట్లు...
ఇన్నర్‌ వేర్‌ మార్కెట్‌ భారత్‌లో రూ.రూ.30,000 కోట్లుంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా 40 శాతం ఉంది. రెండు మూడేళ్ల ‍క్రితం ఇది 20 శాతమేనని నటరాజ్‌ తెలిపారు. ఆసియాలో హొజైరీ తయారీలో అతి పెద్ద కేంద్రంగా తమిళనాడులోని తిరుపూర్‌ నిలిచిందన్నారు. ‘తిరుపూర్‌లో 3,000లకుపైగా ప్లాంట్లు కొలువుదీరాయి. రూ.50,000 కోట్ల విలువైన ఉత్పత్తులు ఇక్కడ ఏటా తయారవుతున్నాయి. ఇందులో ఎగుమతుల వాటా రూ.27,000 కోట్లుంది. 8 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు’ అని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్లాంటు..?
ప్లాంటు ఏర్పాటు చేయాల్సిందిగా పలు రాష్ట్రాలు కేపీఆర్‌ గ్రూప్‌ను ఆహ్వానించాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉన్నాయి. 13వ ప్లాంటును తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పుతారా అని సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎండీ స్పందిస్తూ.. ‘రెండు రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కొత్త యూనిట్‌ విషయమై బోర్డు అనుమతి పొందాలి. ఎంత కాదన్నా ఫ్యాక్టరీకి రూ.500 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుంది. స్పిన్నింగ్‌ మొదలుకుని గార్మెంట్స్‌ తయారీ వరకు ఈ కేంద్రంలో చేపడతాం’ అని పేర్కొన్నారు. రెండేళ్లలో కొత్త ప్లాంటు సాకారం అయ్యే అవకాశం ఉందని కంపెనీ డైరెక్టర్‌ టి.ఎన్‌.అరుణ్‌ వెల్లడించారు.



You may be interested

రూపాయికీ 38 పైసలు బూస్ట్‌

Saturday 21st September 2019

70.94 వద్ద ముగింపు కార్పొరేట్‌ పన్నులను తగ్గిస్తూ, ప్రభుత్వం చేసిన ప్రకటన రూపాయికీ ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 40పైసలు లాభపడి, 70.94 వద్ద ముగిసింది. గురువారం రూపాయి ముగింపు 71.34. అయితే శుక్రవారం ట్రేడింగ్‌లో 71.19 వద్ద ప్రారంభమైంది. అయితే వారంవారీగా చూస్తే, 2పైసలు నష్టంలోనే రూపాయి ఉంది. కాగా రూపాయి 68కిపైగా బలపడ్డం కష్టమేనన్న విశ్లేషణలూ ఉన్నాయి. అక్టోబర్‌ 9వ తేదీన

మందగమనంపై సర్జికల్‌ స్ట్రైక్‌!

Saturday 21st September 2019

 పారిశ్రామిక రంగానికి బూస్టర్‌ డోస్‌... కార్పొరేట్‌ ట్యాక్స్‌ 22 శాతానికి తగ్గింపు సర్‌చార్జీ, సెస్సులతో కలిపి 25.17 శాతమే ఇంతకుముందు ఇది 30 శాతం... 15 శాతానికి మ్యాట్‌ తగ్గింపు కొత్తగా నెలకొల్పే తయారీ కంపెనీలకు పన్ను 15 శాతమే... ఆర్థిక పునరుజ్జీవానికి మోదీ సర్కారు సాహసోపేత నిర్ణయాలు ఖజానాకు 1.45 లక్షల కోట్లు తగ్గనున్న పన్ను ఆదాయం న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగంలో గుర్తుండిపోయే విధంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఊహించని కానుకతో కార్పొరేట్లను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. కార్పొరేట్‌

Most from this category