News


కోటక్‌ మహీంద్రా బ్యాంకు లాభం 51 శాతం అప్‌

Tuesday 22nd October 2019
news_main1571737988.png-29059

సెప్టెంబర్‌ త్రైమాసికానికి కోటక్‌ మహీంద్రా బ్యాంకు అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించింది.

త్రైమాసిక ఫలితాల్లో కీలకాంశాలు...

బ్యాంకు నికర లాభం గతేడాదితో పోలిస్తే 51 శాతం పెరిగి రూ. 1724.5కోట్లకు చేరింది. అనలిస్టుల సరాసరి అంచనా లాభం రూ. 1555 కోట్లు మాత్రమే. బ్యాంకు గతేడాది క్యు2లో రూ. 1142 కోట్ల లాభం నమోదు చేసింది.

  • తాజా త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 25.2 శాతం పెరిగి రూ. 2676 కోట్ల నుంచి రూ. 3349 కోట్లను చేరింది.
  • నికర వడ్డీ మార్జిన్‌ 4.19 శాతం నుంచి 4.61 శాతానికి పెరిగింది. జూన్‌ త్రైమాసికంలో ఎన్‌ఐఎం 4.49 శాతంఉంది.
  • కాసా నిష్పత్తి 50.2 శాతం నుంచి 53.6 శాతానికి పెరిగింది.
  • గతేడాది క్యు2లోకన్నా సరాసరి సేవింగ్స్‌ డిపాజిట్స్‌ 20 శాతం వృద్ధితో రూ. 80425 కోట్లను తాకాయి.
  • కరెంట్‌ అకౌంట్‌ డిపాజిట్స్‌ సరాసరిలో సైతం 22 శాతం వృద్ది కనిపించింది.
  • పలు విభాగాల్లో బ్యాంకు మంచి గణాంకాలు నమోదు చేసినా ఎన్‌పీఏల పరంగా స్వల్ప నిరాశకు గురిచేసింది.
  • బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు జూన్‌ త్రైమాసికంలో 2.19 శాతం ఉండగా, తాజాగా 2.32 శాతానికి పెరిగాయి.
  • నికర ఎన్‌పీఏలు 0.73 నుంచి 0.85 శాతానికి పెరిగాయి.
  • బ్యాంకు ప్రొవిజన్లు గతేడాది క్యు2లో రూ. 354కోట్లుండగా, ప్రస్తుతం రూ. 408 కోట్లను చేరాయి.

మంగళవారం ముగింపు సమయానికి కోటక్‌ మహీంద్రా బ్యాంకు షేరు దాదాపు ఒక్క శాతం లాభంతో రూ. 1630 వద్ద కదలాడుతోంది. 



You may be interested

పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం: ఇన్ఫీ చైర్మన్‌

Tuesday 22nd October 2019

 స్వల్పకాలానికి గాను కంపెనీ మార్జిన్‌లు, లాభాలు పెరగడం కోసం ఇన్ఫోసిస్‌ అనైతిక విధానాలను అనుసరిస్తోందని గుర్తుతెలియని ఉద్యోగుల గ్రూప్‌ యుఎస్‌ నియంత్రణ, ఎక్సేంజ్‌కు, ఇన్ఫోసిస్‌ బోర్డుకు ఫీర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నందన్‌ నీలకేని స్పందించారు. ఇన్ఫోసిస్‌పై వచ్చిన విజిల్‌ బ్లోవర్‌(కంపెనీపై ఆరోపణలు చేసేవారు) ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని స్టాక్‌ ఎక్సేంజికిచ్చిన సమాచారంలో నందన్‌ నీలకేని పేర్కొన్నారు. కాగా ఇన్ఫోసిస్‌ సీఈఓ పరేఖ్‌, సీఎఫ్‌ఓ

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ గరిష్ట స్థాయి నుంచి పతనం

Tuesday 22nd October 2019

బ్రోకరేజ్‌ సంస్థల రేటింగ్‌ అప్‌గ్రేడ్‌తో మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 9శాతం ర్యాలీ చేసిన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు మిడ్‌సెషన్‌ సమయానికి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.239.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కేర్‌ రేటింగ్‌ సంస్థ కంపెనీ ధీర్ఘకాలిక రుణ రేటింగ్‌ను కేర్‌ ఎఎ(+)గానూ, స్వల్పకాలిక రుణ రేటింగ్‌ను కేర్‌ ఎఎగానూ అప్‌గ్రేడ్‌ చేసింది. బ్రిక్స్‌ రేటింగ్‌ సంస్థ సైతం కంపెనీ

Most from this category