News


కోటక్‌ బ్యాంక్‌ లాభం రూ.1,596 కోట్లు

Tuesday 21st January 2020
news_main1579574994.png-31057

  • క్యూ3లో 24 శాతం వృద్ధి 
  • పెరిగిన మొండి బకాయిలు

(అప్‌డేటెడ్‌...)

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.1,596 కోట్ల నికర లాభం(స్టాండ్‌అలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సంర ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.1,291 కోట్లతో పోల్చితే 24 శాతం వృద్ధి సాధించామని కోటక్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,214 కోట్ల నుంచి రూ.8,077 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మరిన్ని వివరాలు.....

నికర వడ్డీ ఆదాయం రూ.3,430 కోట్లు...
రుణ వృద్ధి 10 శాతంగానే ఉంది. గత క్యూ3లో రూ.2,926 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ3లో 17 శాతం వృద్ధితో రూ.3,430 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 4.31 శాతం నుంచి 4.69 శాతానికి ఎగసింది. రుణ నాణ్యత ఒకింత తగ్గింది. స్థూల మొండి బకాయిలు 2.07 శాతం నుంచి 2.46 శాతానికి, నికర మొండి బకాయిలు 0.71 శాతం నుంచి 0.89 శాతానికి పెరిగాయి. తాజా మొండి బకాయిలు రూ.1,000 కోట్ల మేర ఉన్నాయి. మొత్తం కేటాయింపులు రూ.444 కోట్లకు పెరిగాయి.  కన్సాలిడేటెడ్‌గా చూస్తే, నికర లాభం రూ.1,844 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.2,349 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.11,347 కోట్ల నుంచి రూ.13,542 కోట్లకు చేరింది. గత ఏడాది డిసెంబర్‌ 31 నాటికి క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో 18.2 శాతంగా, టైర్‌ వన్‌ మూలధన నిష్పత్తి 17.7 శాతంగా ఉంది. 

బ్యాంక్‌కు చెందిన అన్ని అనుబంధ సంస్థలు మంచి లాభాలను ఆర్జించాయి. బ్రోకింగ్‌ విభాగం రూ.128 కోట్లు, జీవిత బీమా విభాగం రూ.166 కోట్లు, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ రూ.40 కోట్ల మేర లాభాలను ఆర్జించాయి. 



You may be interested

తగ్గిన ఫెడరల్‌ బ్యాంక్‌ మొండి బకాయిలు

Tuesday 21st January 2020

- 32 శాతం పెరిగిన నికర లాభం  న్యూఢిల్లీ: ఫెడరల్‌ బ్యాంక్‌ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్‌ క్వార్టర్లో 32 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.334 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.441 కోట్లకు పెరిగిందని ఫెడరల్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,300 కోట్ల నుంచి రూ.3,738 కోట్లకు ఎగసిందని పేర్కొంది. బ్యాంక్‌ రుణ నాణ్యత ఒకింత మెరుగుపడింది. గత

భారత్‌ వృద్ధి 4.8 శాతమే!: ఐఎంఎఫ్‌

Tuesday 21st January 2020

దావోస్‌: భారత్‌ ఆర్థికవృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) 4.8 శాతమే నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. ఇంతక్రితం ఈ వృద్ధి అంచనా 6.1 శాతం.  వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈఓ) తాజా అంచనాలను ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ ఇక్కడ వెలువరిస్తూ, భారత్‌లో గ్రామీణ డిమాండ్‌ వృద్ధి పడిపోయిందని, బ్యాంకింగ్‌ రుణ వృద్ధి మందగించిందనీ పేర్కొన్నారు. ఆయా కారణాలు భారత్‌ వృద్ధిపై ప్రతికూల ప్రభావం

Most from this category