సీసీడీలో 6 శాతం వాటా ఉంది: కేకేఆర్
By Sakshi

సీసీడీ వ్యవస్థాపకుడు సిద్దార్థ అదృశ్యం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం కేకేఆర్ పేర్కొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఒక ప్రకటన విడుదల చేసింది. సిద్దార్థపైన నమ్మకంతో సీసీడీలో తాము తొమ్మిదేళ్ల క్రితం చేసిన పెట్టుబడుల్లో కొంత మొత్తాన్ని గతేడాది విక్రయించామని.. దీంతో తమ వాటా 10.3 శాతం నుంచి ప్రస్తుతం 6 శాతానికి పరిమితమైనట్లు కేకేఆర్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఒక పీఈ ఇన్వెస్టర్ నుంచి షేర్ల బైబ్యాక్ కోసం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానంటూ సిద్దార్థ రాసినట్లు చెబుతున్న లేఖలో బయటపడిన నేపథ్యంలో కేకేఆర్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా పీఈ ఫండ్స్ ఏడాది నుంచి ఏడేళ్ల కాలానికి మాత్రమే పెట్టుబడులు పెట్టి వైదొలగుతుంటాయని, అయితే తాము మాత్రం సీసీడీ వృద్ధి చెందేంతవరకూ సహకారం అందించి కొంత వాటాను మాత్రమే విక్రయించామని కేకేఆర్ వివరించింది.
You may be interested
ఫలితాలతో..నష్టాల్లో యాక్సిస్ బ్యాంక్
Wednesday 31st July 2019యాక్సిస్ బ్యాంక్ క్యూ1 ఫలితాలు మార్కెట్ల అంచనాలను అందుకోలేకపోవడంతో బుధవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు ఉదయం 9.41 సమయానికి 3.72 శాతం నష్టపోయి రూ. 681.25 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ తన క్యూ1 ఫలితాలలో నికర లాభం రూ. 1,370 కోట్లగా పేర్కొంది. ఇది మార్కెట్ అంచనా వేసిన ఈ కంపెనీ నికర లాభం రూ. 1,850 కోట్ల కంటే తక్కువ కావడం గమనర్హం. కానీ గత
బకాయిలేమీ లేవు: హెచ్డీఎఫ్సీ
Wednesday 31st July 2019సిద్దార్థతో సంబంధం ఉన్న కంపెనీల నుంచి తమకు రుణ బాకాయిలు ఉన్నట్లు వచ్చిన వార్తలను హెచ్డీఎఫ్సీ తోసిపుచ్చింది. ‘సీసీడీకి చెందిన టాంగ్లిన్ డెవలప్మెంట్స్ బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్‌పార్క్ ప్రాజెక్టు కోసం గతంలో మేం రుణాలిచ్చాం. అయితే, 2019 జనవరిలో ఈ మొత్తం రుణాన్ని సంబంధిత సంస్థ చెల్లించేసింది. ప్రస్తుతం కాఫీడే ఎంటర్ ప్రైజెస్ గ్రూపు నుంచి మాకు ఎలాంటి బకాయిలూ లేవు’ అని హెచ్డీఎఫ్సీ ప్రతినిధి ఒకరు స్పష్టం