News


కుటుంబ కల్లోలం..అమ్మకానికి గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌

Tuesday 28th January 2020
news_main1580201259.png-31271

కెకె మోది గ్రూప్‌లో తల్లికొడుకుల మధ్య విభేదాలు
విక్రయానికి లలిత్‌ మోదీ మొగ్గు
సిగరెట్‌ తయారీ సంస్థ గాడ్‌ఫ్రేఫిలిప్స్‌ సహా ప్రముఖ పారిశ్రామికవేత్త కృష్ణకుమార్‌ మోదీ(కేకే మోదీ)కి చెందిన ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టినట్లు ఆయన కుమారుడు లలిత్‌ మోదీ వెల్లడించారు. గాడ్‌ఫ్రేఫిలిప్స్‌ సంస్థ మాల్‌బొరో బ్రాండ్‌ పేరిట సిగిరెట్లు విక్రయిస్తుంది. ఇందులో కేకే మోదీగ్రూప్‌నకు 47.09 శాతం వాటా, ఫిలిప్‌ మోరిస్‌కు 25.1 శాతం వాటా ఉన్నాయి. మోదీ ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ కృష్ణకుమార్‌ మోదీ గత నవంబర్‌లో కన్నుమూశారు. అనంతరం ఆయన భార్య బీనా గ్రూప్‌ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. తాజా అమ్మకంలో భాగంగా కలర్‌బార్‌, ఈగో ఇటాలియన్‌, బేకాన్‌ ట్రావెల్స్‌, ఎడ్యుకేషన్‌ వ్యాపారాల్లో వాటాలను మాత్రం విక్రయించడం లేదని లలిత్‌ ఒక ట్వీట్‌లో వెల్లడించారు. ఇవన్నీ బీనా మోదీ ఆమె కొడుకు సమీర్‌, కూతురు చారు కింద ఉంటాయి. తాజా విక్రయంలో భాగంగా గాడ్‌ఫ్రేఫిలిప్స్‌తో పాటు మోదీ కేర్‌, మోదీకేర్‌ హెల్త్‌కేర్‌ ప్లేస్‌మెంట్‌, 24సెవెన్‌ స్టోర్స్‌తో పాటు దాదాపు 57 ఆస్తులను విక్రయిస్తారు. ఎవరు ఎక్కువ కోట్‌ చేస్తే వారికి విక్రయిస్తామని, ఈ విధానంలో ఇన్వెస్ట్‌మెంట్‌బ్యాంకర్‌కు గ్రూప్‌ సీఈఓ ఆర్‌కే మల్హోత్రా సహకరిస్తారని లలిత్‌ తెలిపారు. 

తన తల్లి బీనా ఆధ్వర్యంలో వ్యాపారాలు నడపడం ఇష్టం లేదన్నట్లు లలిత్‌ పరోక్షంగా ట్వీట్లలో వెల్లడించారు. గ్రూప్‌ను నడిపే అనుభవం, చదువు ఆమెకు లేవన్నట్లుగా ట్వీట్‌ చేశారు. ఆస్తుల అమ్మకాలను వచ్చే నవంబర్‌ చివరకు పూర్తి చేస్తామని తెలిపారు. మరోవైపు ఆస్తుల అమ్మకమై వస్తున్న వార్తలు తప్పని, ఒకవేళ అలాంటిది ఉన్నా ట్రస్టు నిబంధనల మేరకు బయటకు వెల్లడించమని బీనా మోదీ చెప్పారు. ప్రమోటర్ల వాటా విక్రయ విషయమై ఎలాంటి సమాచారం తమవద్ద లేదని గాడ్‌ఫ్రేఫిలిప్స్‌ కంపెనీ ఎక్చేంజ్‌లకు తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్‌ విలువ దాదాపు రూ. 7500 కోట్లుంటుంది. కేకే మోదీ ట్రస్ట్‌ నిబంధనల ప్రకారం ట్రస్టు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం రాకపోతే ఆస్తులన్నీ అమ్ముకోవచ్చు. దీన్ని సాకుగా చూపి లలిత్‌ మోదీ ఆస్తుల విక్రయానికి పట్టుబడుతున్నట్లు తెలిసింది. You may be interested

నవీన్‌, సీసీఎల్‌.. జూమ్‌- హెచ్‌జీ ఇన్‌ఫ్రా వీక్‌

Tuesday 28th January 2020

క్యూ3 ఎఫెక్ట్‌- నవీన్‌, సీసీఎల్‌ జోరు హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ పతనం కరోనా వైరస్‌ భయాలతో ప్రపం‍చ మార్కెట్లు వెనకడుగులో ఉన్నప్పటికీ తొలుత హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి డీలాపడ్డాయి. మధ్యాహ్నం 3 ప్రాంతంలో మార్కెట్లు నష్టాలతో కదులుతున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో నవీన్‌ ఫ్లోరిన్‌ కెమికల్స్‌, సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా మరోవైపు ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో

మారుతీ నికర లాభం రూ. 1587 కోట్లు

Tuesday 28th January 2020

క్యూ3లో 6.5 శాతం అధికం 5 శాతం పెరిగిన ఆదాయం దేశీయంగా కార్ల తయారీలో అగ్రస్థానాన్ని వహిస్తున్న  మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ. 1587 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 6.5 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం సైతం 5 శాతం పెరిగి రూ. రూ. 20,722 కోట్లకు చేరింది. వ్యయ నియంత్రణ,

Most from this category