News


5 నెలల్లో 50వేల కియా కార్లు

Monday 27th January 2020
news_main1580094339.png-31217

  • 5 నెలల్లో 50,000 యూనిట్ల అమ్మకాలు

ముంబై: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌.. భారత్‌లో తాజాగా మరో మైలు రాయిని దాటింది. గతేడాది ఆగస్టులో తన ‘సెల్టోస్‌ మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీ’ కారును ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ సంస్థ.. కేవలం 5 నెలల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలను నమోదుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో కారు ఉత్పత్తి అవుతోన్న విషయం తెలిసిందే కాగా, ఈ కారు అమ్మకాల స్పీడును చూసి మరిన్ని మోడళ్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. వచ్చే నెల 5 నుంచి 12 వరకు జరిగే ఆటో ఎక్స్‌పో 2020లో వీటిని ప్రదర్శించనుంది. కాంపాక్ట్‌ ఎస్‌యూవీ, కార్నివాల్ ఎంపీవీ కార్లను ప్రదర్శనకు ఉంచనున్నట్లు వెల్లడించింది. 



You may be interested

కొత్త గిడ్డంగులు వస్తున్నాయ్‌

Monday 27th January 2020

ముంబై: దేశవ్యాప్తంగా ఈ ఏడాది హైదరాబాద్‌ సహా ఎనమిది ప్రధాన నగరాల్లో 4 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన గిడ్డంగులు రానున్నాయి. సరుకు రవాణా రంగంలో గిడ్డంగులు కూడా అంతర్భాగం కావడంతో ఈ స్థాయిలో కొత్తవి ఏర్పాటవుతున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ సావిల్స్‌ నివేదిక వెల్లడించింది. ఈ-కామర్స్‌, రిటైల్‌, ఎఫ్‌ఎంసీజీ, థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌, కోల్డ్‌ స్టోరేజ్‌, ఫార్మా, తయారీ రంగాల్లో గిడ్డంగులకు డిమాండ్‌ అధికమవడంతో ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు,

5జీ స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది

Monday 27th January 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- స్మార్ట్‌ఫోన్స్‌ తయారీలో ఉన్న చైనా కంపెనీ ఐకూ భారత్‌కు ఫిబ్రవరిలో ఎంట్రీ ఇస్తోంది. 5జీ స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి రంగ ప్రవేశం చేయనుంది. భారత్‌లో ఇదే తొలి 5జీ మోడల్‌ కానుంది. 5జీతోపాటు 4జీ మోడళ్లనూ ప్రవేశపెట్టనున్నట్టు ఐకూ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ గగన్‌ అరోరా తెలిపారు. 2020లో దేశీయంగా 10 లక్షల యూనిట్లను విక్రయించాలన్న లక్ష్యంతో కంపెనీ దూసుకొస్తోంది. తొలుత ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకోనున్న ఈ బ్రాండ్‌,

Most from this category