News


మార్కెట్లోకి ‘కియా సెల్టోస్‌ ఎస్‌యూవీ’

Friday 23rd August 2019
news_main1566540530.png-27967

ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా మోటార్స్‌ తాజాగా తన ‘సెల్టోస్‌ మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీ’ కారును భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో ఇటీవలే తొలి కారును ఆవిష్కరణ కంపెనీ.. గురువారం దేశవ్యాప్తంగా విడుదలచేసింది. ఈకారు ధరల శ్రేణి రూ.9.69 లక్షలు నుంచి రూ.15.99 లక్షలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 32,035 బుకింగ్స్‌ పూర్తయినట్లు సంస్థ ఎండీ, సీఈఓ కూక్‌ హున్‌ షిమ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్లాంట్‌లో 5,000 యూనిట్ల ఉత్పత్తి పూర్తికాగా.. ఇవి డెలివరీకి సిద్దంగా ఉన్నాయి. మిగిలిన కస్టమర్లకు 45- 60 రోజుల సమయం పడుతుంది. ఇక అనంతపురం ప్లాంట్‌ నుంచే త్వరలో దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతికానున్నట్లు చెప్పారయన. ఆటోరంగ పరిశ్రమపై మాట్లాడిన ఆయన.. ఈ రంగం ఇబ్బందుల్లో పడడం, మళ్లీ పుంజుకోవడం వంటి తాత్కాలిక ఒడిదుడుకులు ఉంటాయని వ్యాఖ్యానించారు. 



You may be interested

అనిశ్చితి నిరోధానికి అసాధారణ చర్యలు

Friday 23rd August 2019

ఆర్థిక మందగమనంపై  నీతి ఆయోగ్‌ సూచన ఫైనాన్షియల్‌ రంగంలో  ఎన్నడూ లేనంత ఒత్తిడి  ప్రైవేటు రంగంలో  ఒకరినొకరు విశ్వసించని స్థితి... దీని నివారణకు చర్యలు అవసరం న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనడానికి అసాధారణ చర్యలు అవసరమని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ కేంద్రానికి సూచించారు. ఫైనాన్షియల్‌ రంగంలో ముందెన్నడూ లేనంత తీవ్ర ఒత్తిడి నెలకొందనీ, ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రతకూ ఇదీ ఒక కారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు రంగాన్ని ప్రస్తావిస్తూ, ఈ రంగంలో

ఎయిర్‌ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేత

Friday 23rd August 2019

బకాయిలు చెల్లించకపోవడం వల్లే  న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాకు ఇంధన సరఫరాలను ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిలిపివేశాయి. విశాఖపట్టణం, కొచ్చిన్‌, మోహాలీ, రాంచి, పుణే, పాట్నా... ఈ ఆరు విమానాశ్రయాల్లో ఎయిర్‌ ఇండియా విమానాలకు ఇంధన సరఫరాలను గురువారం సాయంత్రం గం. 4 ల నుంచి ఆపేశామని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఎయిర్‌ ఇండియా సంస్థ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ ఇంధన సరఫరాల

Most from this category