News


బీఎస్‌-6కు మారడం సవాలే

Saturday 7th September 2019
news_main1567831738.png-28252

  • బీఎస్‌-సిక్స్‌కు మారడం సవాళ్లతో కూడుకున్నదే 
  • జీఎస్‌టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి 
  • సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వాధేరా 


న్యూఢిల్లీ: భారత్‌ స్టేజ్‌-సిక్స్‌ (బీఎస్‌-6) నిబంధనలకు వాహన రంగం సజావుగా మారడానికి ప్రభుత్వం తగిన విధంగా తోడ్పాటునందించాలని సియామ్‌ కోరింది. బీఎస్‌-సిక్స్‌  నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తున్నా,  బీఎస్‌-సిక్స్‌ ఇంధనాల లభ్యత విషయమై  ఆందోళన ఉందని సియామ్‌(సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటో మాన్యుఫాక్చరర్స్‌) ప్రెసిడెంట్‌ రాజన్‌ వాధేరా చెప్పారు. ఇక్కడ జరిగిన ఏసీఎమ్‌ఏ(ఆటోమోటివ్‌ కాంపొనెంట్‌  మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా) వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. 

చారిత్రాత్మక సమస్య ...
బీఎస్‌-సిక్స్‌ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానున్నాయని, అంతకు ఒక రోజు ముందు, మార్చి 31 నాడు బీఎస్‌-ఫోర్‌ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలు నిలిపేయడం... వాహన రంగానికి చారిత్రాత్మక సమస్య కానున్నదని వాధేరా పేర్కొన్నారు. ఇలాంటిది ఇంతవరకూ ప్రపంచంలో ఎక్కడా జరగలేదని పేర్కొన్నారు. బీఎస్‌ ఫోర్‌ వాహన అమ్మకాలు ఎలా ఉంటాయో అంచనా వేసి, మార్చి 31 నాటికి ఒక్క వాహనం కూడా మిగలకుండా విక్రయించడం, చాలా కష్టసాధ్యమైన విషయమని వివరించారు. ఇది వినియోగదారుల్లో గందరగోళాన్ని మరింతగా పెంచడమే అవుతుందని, వాహన కంపెనీలకు భారీగా నష్టాలను మిగులుస్తుందని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. 

త్వరగా జీఎస్‌టీపై నిర్ణయం ...
త్వరలో పండుగల సీజన్‌ ఆరంభమవుతోందని, జీఎస్‌టీపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని  ప్రభుత్వాన్ని రాజన్‌ కోరారు. మొత్తం వార్షిక అమ్మకాల్లో ఈ పండుగ సీజన్‌ అమ్మకాలే 15-20 శాతంగా ఉంటాయని, ఈ పండుగ సీజన్‌లో అయినా అమ్మకాలు పుంజుకుంటాయనే ఆశలున్నాయని పేర్కొన్నారు. సెంటిమెంట్‌ మెరుగుపడటం ముఖ్యమని వివరించారు. 



You may be interested

కార్పొరేట్‌ మోసాలతో సవాళ్లు

Saturday 7th September 2019

కేంద్ర మంత్రి ఠాకూర్‌ న్యూఢిల్లీ: పెరిగిపోతున్న కార్పొరేట్‌ మోసాలు కార్పొరేట్‌ పరిపాలనా చట్టాలకు సవాళ్లను విసురుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ అన్నారు. ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీస్‌ అకాడమీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతున్న కార్పొరేట్‌ మోసాలు, ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలను ఎదుర్కొంటోంది. ఇవి మూలధన ఏర్పాట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దాంతో నిధులు అడుగంటిపోతున్నాయి. కార్పొరేట్‌

మాంద్యం ముదిరితే మరింత ముప్పు !

Saturday 7th September 2019

మరో పది లక్షల ఉద్యోగాలకు ఎసరు  జీఎస్‌టీ తగ్గించాలి మరిన్ని ఉద్దీపన చర్యలు కోరుతున్న వాహన పరిశ్రమ  న్యూఢిల్లీ: వాహన రంగంలో నెలకొన్న ప్రస్తుత మందగమనం ఇలాగే కొనసాగితే, మరిన్ని ఉద్యోగాలు పోతాయని వాహన పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో మరిన్ని సామాజిక పరిణామాలు చోటు చేసుకుంటాయని సియామ్‌ ప్రెసిడెంట్‌ రాజన్‌ వధేరా హెచ్చరించారు. అందుకని ప్రభుత్వం తక్షణం జీఎస్‌టీ తగ్గింపు వంటి  ఉద్దీపన చర్యలు ప్రకటించాలని ఆయన అభ్యర్థించారు.  భారత్‌ స్టేజ్‌-సిక్స్‌ పర్యావరణ నిబంధనలు

Most from this category