News


హైదరాబాద్‌లో రూ.700 ‍కోట్లతో కటేరా ప్లాంటు

Thursday 8th August 2019
news_main1565242883.png-27630

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- డిజైన్‌, టెక్నాలజీని ఆసరాగా చేసుకుని నిర్మాణ రంగంలో ఉన్న యూఎస్‌ కంపెనీ కటేరా హైదరాబాద్‌ వద్ద ప్లాంటును నెలకొల్పుతోంది. శంషాబాద్‌ సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ కేంద్రానికి కంపెనీ సుమారు రూ.700 కోట్లు వెచ్చిస్తోంది. నవంబరు నుంచి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తుల తయారీ ప్రారంభం అవుతుందని కటేరా ఆసియా ప్రెసిడెంట్‌ ఆశ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు. డిజైన్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ నజీబ్‌ ఖాన్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 2020 మార్చిలో ప్లాంటు నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పారు. 1,000 మందికి ప్రత్యక్షంగా, 7,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందన్నారు. రోబోటిక్‌ అసెంబ్లీ విధానంలో ఏటా 80 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణ ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యం ఈ ప్లాంటుకు ఉంది.
వ్యయం 30 శాతం తక్కువ..
కంపెనీ మల్టీ ఫ్యామిలీ హోమ్స్‌, కమర్షియల్‌ బిల్డింగ్స్‌, హోటళ్లు, మాల్స్‌, ఆసుపత్రులు, స్కూళ్ల నిర్మాణం చేపడుతోంది. 700 ప్రాజెక్టులు పూర్తి చేసింది. ‘గోడలు, సీలింగ్‌, ఫ్లోరింగ్‌ వంటివన్నీ కూడా మా ఫ్యాక్టరీలో తయారవుతాయి. వీటిని నిర్మాణ స్థలంలో సులువుగా బిగించడమే. తలుపులు, కిటికీలు కూడా తయారు చేస్తున్నాం. కట్టడాలు 100 ఏళ్లపాటు మన్నికగా ఉంటాయి. అతి తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి కావడమేగాక, వ్యయం 30 శాతం తక్కువ అవుతుంది. ఒక కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. బెంగళూరు సమీపంలో 45 ఎకరాల్లో ప్లాంటు ఉంది. భారత్‌లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,000లపైమాటే’ అని ఆశ్‌ భరద్వాజ్‌ వివరించారు.



You may be interested

హైదరాబాద్‌లో నోబ్రోకర్‌.కామ్‌ సేవలు

Thursday 8th August 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- రియల్‌ ఎస్టేట్‌ పోర్టల్‌ నోబ్రోకర్‌.కామ్‌ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. కస్టమర్‌ నుంచి కస్టమర్‌కు సేవలందిస్తున్న ఈ కంపెనీ ఇప్పటికే అయిదు నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అద్దె, కొనుగోలు, విక్రయానికి ఉన్న రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ప్రాపర్టీస్‌ను ఈ పోర్టల్‌లో నమోదు చేయవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీల్లో ఎటువంటి బ్రోకరేజ్‌ వసూలు చేయబోమని కంపెనీ ఫౌండర్‌, సీబీవో సౌరభ్‌ గర్గ్‌ తెలిపారు. ఫౌండర్‌, సీటీవో అఖిల్‌ గుప్తాతో కలిసి బుధవారమిక్కడ

ఇండియన్ బ్యాంక్‌తో ఆదిత్య బిర్లా లైఫ్ జట్టు

Thursday 8th August 2019

చెన్నై: ప్రైవేట్ రంగ బీమా సంస్థ ఆదిత్య బిర్లా లైఫ్ సన్ లైఫ్ ఇన్సూరెన్స్‌కి ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్‌ కార్పొరేట్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఇండియన్ బ్యాంక్ ఎండీ పద్మజ చుండూరు, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్ ఇన్సూరెన్స్ ఎ౾ండీ అజయ్ శ్రీనివాసన్ ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌కు చెందిన జీవిత బీమా పథకాలను ఇండియన్ బ్యాంక్ తమ ఖాతాదారులకు

Most from this category