News


వైద్య సేవల్లోకి కత్రియ గ్రూప్‌

Thursday 24th October 2019
news_main1571887732.png-29095

  • ఎస్‌ఎల్‌జీ హాస్పిటల్స్‌ ఏర్పాటు
  • మొత్తం రూ.350 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఆతిథ్య రంగంలో ఉన్న కత్రియ గ్రూప్‌ వైద్య సేవల్లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌లోని బాచుపల్లి వద్ద ఎస్‌ఎల్‌జీ పేరుతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 550 పడకలు అందుబాటులోకి వచ్చాయని సంస్థ సీఎండీ దండు శివ రామ రాజు బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. 2022 నాటికి ఆసుపత్రిని 999 పడకల స్థాయికి చేరుస్తామని వెల్లడించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.350 కోట్లని వివరించారు. నర్సింగ్‌ స్కూల్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీ సైతం ఏర్పాటు చేస్తామన్నారు. అత్యాధునిక పాథాలజీ ల్యాబ్‌, డయాగ్నోస్టిక్ సెంటర్‌ ఉందని చెప్పారు. ప్రస్తుతం 42 రకాల స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయని ఎస్‌ఎల్‌జీ సీఈవో ఏ.రామ్‌ పాపా రావు తెలిపారు. 140 మంది వైద్యులు, 280 మంది ప్యారా మెడికల్‌ సిబ్బందిని నియమించామన్నారు. 
హోటల్‌ సైతం ఇక్కడే ...
ఆసుపత్రికి ఆనుకుని 3 స్టార్‌ హోటల్‌ సైతం నిర్మిస్తున్నారు. 120 గదులతో సిద్ధమవుతున్న ఈ హోటల్‌ మార్చికల్లా రెడీ అవుతుందని సంస్థ ఈడీ డీవీఎస్‌ సోమ రాజు తెలిపారు. 1,000 మంది కూర్చునే వీలున్న సమావేశ మందిరం సైతం అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. ఆసుపత్రికి ఆనుకుని హోటల్‌ ఉండడం రోగులకు కలిసి వస్తుందని అన్నారు. ముఖ్యంగా విదేశీ రోగులకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు. ఎయిర్‌ అంబులెన్స్‌ కోసం హెలిప్యాడ్‌ సైతం నిర్మించామన్నారు. 



You may be interested

‘హీరో’ లాభం 10 శాతం డౌన్‌

Thursday 24th October 2019

రూ.884 కోట్లకు తగ్గిన నికర లాభం  21 శాతం తగ్గిన విక్రయాలు  త్వరలో బీఎస్‌-సిక్స్‌ బైక్‌లు  న్యూఢిల్లీ: టూ వీలర్‌ దిగ్గజం హీరో మోటొకార్ప్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 10 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.982 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.884 కోట్లకు తగ్గిందని హీరో మోటొకార్ప్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.9,168 కోట్ల నుంచి రూ.7,661 కోట్లకు తగ్గిందని కంపెనీ

వియ్‌వర్క్‌కు సాఫ్ట్‌బ్యాంకు 9.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీ

Thursday 24th October 2019

టోక్యో: సంక్షోభంలో చిక్కుకున్న ఆఫీస్‌-షేరింగ్ సేవల స్టార్టప్ సంస్థ వియ్‌వర్క్‌ను గట్టెక్కించేందుకు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సాఫ్ట్‌బ్యాంక్‌ తాజాగా 9.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో 5 బిలియన్ డాలర్లు కొత్తగా ఇన్వెస్ట్ చేయడంతో పాటు ప్రస్తుత షేర్‌హోల్డర్ల నుంచి షేర్లను కొనుగోలు చేసేందుకు 3 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. షేర్ల కొనుగోలు ప్రక్రియ ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్ చైర్మన్‌ మసయోషి సన్ తెలిపారు. ప్రస్తుతం

Most from this category