News


'కార్వీ' ఉదంతంతో కన్సాలిడేషన్ వేగవంతం

Wednesday 11th December 2019
news_main1576034126.png-30162

  • వచ్చే ఏడాది 13,400కు నిఫ్టీ
  • కొటక్‌ సెక్యూరిటీస్‌ ఎస్‌వీపీ రష్మిక్‌ ఓఝా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కార్వీ ఉదంతంతో బ్రోకింగ్‌ పరిశ్రమలో కన్సాలిడేషన్‌ మరింత వేగవంతమయ్యే అవకాశముందని కొటక్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఫండమెంటల్‌ రీసెర్చ్‌ విభాగం హెడ్‌) రష్మిక్‌ ఓఝా అంచనా వేశారు. దీని వల్ల పెద్ద సంఖ్యలో క్లయింట్స్‌.. క్రమంగా చిన్న సంస్థల నుంచి పటిష్టమైన, పెద్ద సంస్థల వైపు మళ్లే అవకాశాలున్నాయని మంగళవారమిక్కడ విలేకరులతో చెప్పారు. క్లయింట్ల సెక్యూరిటీలను సొంత అవసరాలకు వాడుకుందని కార్వీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు, వచ్చే ఏడాది ఆఖరు నాటికి నిఫ్టీ 13,400 పాయింట్లు, సెన్సెక్స్‌ 45,500 పాయింట్లకు చేరవచ్చని కొటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తున్నట్లు ఓఝా చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు నిరాశావహంగా కనిపిస్తున్నప్పటికీ.. మార్కెట్‌ మాత్రం సానుకూలంగా ఉంటోందని పేర్కొన్నారు. కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటు తగ్గింపు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల రాకతో పాటు దేశీయంగా సిప్‌ రూపంలో పెట్టుబడులు వస్తుండటం మార్కెట్లకు దోహదపడుతోందని ఓఝా తెలిపారు. మార్కెట్లు, ఎకానమీ మధ్య వైరుధ్యాలు మరికొంత కాలం కొనసాగవచ్చని, బడ్జెట్‌లో తాయిలాలపై ఆశలతో మార్కెట్లు అధిక స్థాయిలోనే ఉండవచ్చని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ వంటి అంశాలు వచ్చే ఏడాది కీలకంగా ఉండగలవని చెప్పారు. మందగమనం, ఆదాయాల్లో పెద్దగా మార్పులు లేకపోవడం, అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ తీవ్రత మొదలైనవి దేశీ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని ఓఝా చెప్పారు.
ఆకర్షణీయంగా ఈ రంగాలు...
కార్పొరేట్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు (పటిష్టమైన మాతృసంస్థల మద్దతున్నవి), ఆయిల్‌ అండ్‌ గ్యాస్, క్యాపిటల్‌ గూడ్స్, నిర్మాణ, హెల్త్‌కేర్, అగ్రోకెమికల్స్‌ రంగాల షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని ఓఝా పేర్కొన్నారు. సిమెంటు, ఫార్మా రంగాల్లో మిడ్‌ క్యాప్‌ కంపెనీలు కూడా పరిశీలించవచ్చని తెలిపారు. You may be interested

గోల్డ్‌.. క్రూడ్‌... రెండూ రయ్‌ రయ్‌!

Wednesday 11th December 2019

గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా 2020 అంచనాల పెంపు న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రెండు కమోడిటీలు- బంగారం, క్రూడ్‌ రెండూ 2020లో అప్‌ట్రెండ్‌లోనే ఉంటాయని అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం- గోల్డ్‌మన్‌శాక్స్‌ అంచనా వేసింది. ఈ సంస్థ ఇంకా ఏమని చెబుతోందంటే... ‘‘అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌ (నైమెక్స్‌)లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) ధర 2020లో సగటున 1,600 డాలర్లుగా ఉంటుంది. 2021లో కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. అంతర్జాతీయంగా ఆర్థిక

యస్‌ బ్యాంక్‌లో పెట్టుబడులపై అనిశ్చితి

Wednesday 11th December 2019

సైటాక్స్‌ గ్రూప్ ఆఫర్‌కు ఓకే.. తదుపరి బోర్డ్‌సమావేశంలోనే తుది ని‍ర్ణయం ఇంకా పరిశీలనలోనే బ్రెయిచ్‌ ప్రతిపాదన ముంబై: యెస్‌ బ్యాంక్‌లో పెట్టుబడుల ప్రతిపాదనపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. 200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు రాగలవని భావించగా, కేవలం 50 కోట్ల డాలర్లకే బ్యాంక్‌ సుముఖత వ్యక్తం చేసింది. సైటాక్స్‌ హోల్డింగ్స్‌, సైటాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ ప్రతిపాదించిన ఈ ఆఫర్‌ విషయంలో సానుకూలంగా ఉన్నామని మంగళవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం యస్‌

Most from this category