News


చేయకూడనివన్నీ చేసింది..

Thursday 28th November 2019
news_main1574910980.png-29907

  • కార్వీపై సెబీ చీఫ్‌ త్యాగి వ్యాఖ్యలు
  • సంస్థపై ఈవై ఫోరెన్సిక్ ఆడిట్‌
  •  సెబీ, ఎన్‌ఎస్‌ఈలతో బ్యాంకర్ల చర్చలు

ముంబై/హైదరాబాద్‌ బిజినెస్ బ్యూరో:- క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి ఆ సొమ్మును సొంత అవసరాలకు వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ సంస్థ ఎన్నడూ అనుమతించని కార్యకలాపాలన్నింటినీ కార్వీ సాగించిందని వ్యాఖ్యానించారు. "ఇలాంటి లావాదేవీలు జరపరాదంటూ విస్పష్టమైన సర్క్యులర్‌ జూన్‌లోనే ఇచ్చాం. అయితే గతంలో కూడా వీటికి అనుమతి లేదు. కార్వీ ప్రాథమికంగా అనుమతించని పనులన్నీ చేసింది. నిబంధనల్లో ప్రత్యేకంగా లేదు కాబట్టి క్లయింట్ల షేర్లను సొంతానికి వాడేసుకుంటామంటే కుదరదు" అని త్యాగి స్పష్టం చేశారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కో–ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) నిర్వహించిన ఆసియా రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కార్వీ గతంలోనూ ఇలాంటివి చేసిందని చెప్పిన త్యాగి... గతంలో తమ ఆడిట్లలో వీటిని ఎందుకు బయటపెట్టలేకపోయామన్నది మాత్రం చెప్పలేదు.
ఎన్‌ఎస్‌ఈ, సెబీతో బ్యాంకర్ల చర్చలు.. 
కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఖాతాల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేసేందుకు ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) సంస్థను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ) నియమించినట్లు సమాచారం. మరోవైపు, కార్వీకి రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థల్లో ఆందోళన పెరుగుతోంది. సెబీ ఉత్తర్వుల్లో రియల్ ఎస్టేట్ లావాదేవీల ప్రస్తావన కూడా ఉండటంతో దీనిపై అవి మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య తీవ్రత, కార్వీ కంపెనీలేమైనా డిఫాల్ట్ అయ్యే అవకాశాలున్నాయా అన్న విషయాల గురించి తెలుసుకునేందుకు ఎన్‌ఎస్‌ఈ, సెబీతో అవి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను తనఖా పెట్టి బ్యాంకుల నుంచి కార్వీ సుమారు రూ.600 కోట్ల మేర నిధులు తీసుకున్నట్లు తెలియవచ్చింది. 
అంతా సర్దుకుంటుంది: కీలక ఉద్యోగులకు కార్వీ చీఫ్ లేఖ..
ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడగలమని కార్వీ గ్రూప్ చైర్మన్ సి.పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. తనఖాలో ఉన్న షేర్లను త్వరలోనే విడిపిస్తామని, క్లయింట్లకు కూడా చెల్లింపులు జరిపేస్తామని పేర్కొంటూ సంస్థ కీలక ఉద్యోగులకు బుధవారం ఆయనో లేఖ రాసినట్లు తెలిసింది. గరిష్ఠంగా రెండు వారాల్లో చెల్లింపులు పూర్తిచేస్తామని కొద్దిరోజులుగా చెబుతున్న ఆయన... ఈ లేఖలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. 



You may be interested

ప్రైవేటీకరణ కాకపోతే ఎయిర్‌ఇండియాను మూసేయడమే

Thursday 28th November 2019

పౌరవిమానయాన మంత్రి హర్‌దీప్‌సింగ్‌పురి న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియాను ప్రైవేటీకరించకపోతే, మూసేయాల్సి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హరదీప్‌సింగ్‌ పురి బుధవారం రాజ్యసభకు తెలిపారు. సంస్థ ఉద్యోగులు అందరికీ సానుకూల ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎయిర్‌ ఇండియా తన ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని, ప్రైవేటీకరించేంత వరకు ఏ ఒక్కరినీ ఉద్యోగాల నుంచి తీసివేయడం జరగదని వివరించారు. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అంతర్జాతీయంగా విమానాల రద్దీ తగ్గుముఖం పట్టినా,

వచ్చే ఆరు నెలలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ హవా: మెహతా

Wednesday 27th November 2019

రానున్న 6-12 నెలల కాలంలో మార్కెట్లు ఎగువ దిశలోనే కొనసాగితే అప్పుడు అధిక శాతం స్మాల్‌, మిడ్‌క్యాప్‌ కంపెనీలు లార్జ్‌క్యాప్‌నకు మించి పనితీరు చూపిస్తాయని ఎలిగ్జిర్‌ ఈక్విటీస్‌ వ్యవస్థాపకుడు దీపన్‌ మెహతా పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..   మిడ్‌క్యాప్స్‌ ఇక ముందు ఇన్వెస్టర్లు ఎంచుకున్న రంగాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి (లార్జ్‌క్యాప్‌ మినహా) స్టాక్స్‌ను కొనుగోలు చేయడం మంచిది. మీరు ఏ

Most from this category