News


కార్వీ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ

Wednesday 1st January 2020
news_main1577849415.png-30574

  • ఆర్థిక, ఆర్థికేతర సర్వీసుల విభాగాల కింద విభజన
  • ఆర్థిక సేవల విభాగానికి గ్రూప్ సీఈవోగా అమితాబ్ చతుర్వేది

హైదదరాబాద్‌, బిజినెస్ బ్యూరో: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందన్న ఆరోపణలపై కఠిన చర్యలు ఎదుర్కొంటున్న కార్వీ గ్రూప్ .. తాజాగా వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్టింది. ఆర్థిక సర్వీసులు, ఆర్థికేతర సర్వీసుల కింద రెండు విభాగాలుగా వ్యాపారాన్ని విభజించే ప్రక్రియ ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. తద్వారా గవర్నెన్స్‌ను, వ్యాపార నిర్వహణను మెరుగుపర్చుకోనున్నట్లు తెలిపింది. పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా స్టాక్ బ్రోకింగ్‌, వెల్త్ మేనేజ్‌మెంట్‌, కమోడిటీల ట్రేడింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ తదితర వ్యాపారాలను ఆర్థిక సేవల విభాగం కింద చేర్చనున్నట్లు కార్వీ వివరించింది. అలాగే, డేటా మేనేజ్‌మెంట్ సేవలు, డేటా అనలిటిక్స్‌, మార్కెట్ రీసెర్చ్, అనుబంధ వ్యాపారాలు.. ఆర్థికయేతర విభాగం పరిధిలో ఉంటాయని పేర్కొంది. సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో కూడా మార్పులు చేర్పులు చేపడుతున్నట్లు తెలిపింది. ఆర్థిక సేవల వ్యాపార విభాగం గ్రూప్ సీఈవోగా అమితాబ్‌ చతుర్వేది నియమితులైనట్లు కార్వీ గ్రూప్ చైర్మన్ సి. పార్థసారథి తెలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో సుమారు మూడు దశాబ్దాలపైగా అనుభవం ఉన్న చతుర్వేది సారథ్యంలో సంస్థ కొత్త శిఖరాలు అధిరోహించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చతుర్వేది గతంలో ధనలక్ష్మి బ్యాంక్‌, రిలయన్స్ ఏఎంసీ, ఐసీఐసీఐ, ఎస్సెల్ గ్రూప్ తదితర సంస్థల్లో పనిచేశారు. కార్వీ బ్రాండ్‌ను పటిష్టంగా తీర్చిదిద్దేందుకు, కొత్తగా నిధుల సమీకరణతో సంస్థను మరింత ఉన్నత స్థాయికి చేర్చేందుకు కృషి చేస్తామని చతుర్వేది తెలిపారు. 



You may be interested

చిన్న మొత్తాల పొదుపులపై వడ్డీ రేట్లు యథాతథం

Wednesday 1st January 2020

న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలైన ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్‌ వంటి వాటిపై ప్రస్తుతమున్న రేట్లనే జనవరి-మార్చి త్రైమాసికానికి కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో నిర్ణయించిన రేట్లే తదుపరి మూడు నెలల కాలానికి కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీపై వడ్డీ రేటు 7.9 శాతంగా, కిసాన్‌ వికాస్‌ పత్రపై 7.6 శాతంగా, ఐదేళ్ల సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 8.6 శాతంగా, సుకన్య

బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు

Wednesday 1st January 2020

ఈబీఆర్‌ ఆధారిత రేటును పావు శాతం తగ్గించిన ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్ను సవరిస్తున్న ఇండియన్ బ్యాంక్‌ ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. రుణాలకు సంబంధించి ఎక్స్‌టర్నల్ బెంచ్‌ మార్క్ ఆధారిత వడ్డీ రేట్లను (ఈబీఆర్‌) 25 బేసిస్‌ పాయింట్ల (పావు శాతం) మేర తగ్గించింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది.  కొత్త కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేటు 7.90

Most from this category