News


కార్వీ కేసులో సెబీకి శాట్ ఆదేశాలు

Wednesday 18th December 2019
news_main1576641420.png-30282

న్యూఢిల్లీ: బ్రోకింగ్ సంస్థ కార్వీ వివాదంలో యాక్సిస్ బ్యాంకు అభ్యర్ధనపై 15 రోజుల్లోగా ఉత్తర్వులు ఇవ్వాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్ (శాట్) ఆదేశించింది. వివరాల్లోకి వెడితే.. క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని కార్వీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  తనఖా పెట్టిన షేర్లకు ప్రతిగా కార్వీకి యాక్సిస్ బ్యాంకు రూ. 81 కోట్ల రుణం ఇచ్చింది. అయితే, తనఖా షేర్లను క్లయింట్లకు బదలాయించేయాలంటూ సెబీ గతంలో ఇచ్చిన ఆదేశాల కారణంగా.. ఈ షేర్లపై యాక్సిస్ బ్యాంకుకు హక్కులు లేకుండా పోయాయి. దీంతో వివాద పరిష్కారం కోసం శాట్‌ను ఆశ్రయించింది. 



You may be interested

12350 పాయింట్ల వరకు నిఫ్టీ!

Wednesday 18th December 2019

12070 పైన బలంగా ఉంటేనే... నిఫ్టీ చార్టుల్లో బలమైన బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరచింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 12070 పాయింట్ల పైన బలంగా ఉన్నంత వరకు 12290 - 12350 పాయింట్లను చేరే అవకాశాలు అధికమని నిపుణులు అంచనా వేస్తున్నారు. జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం, ట్రంప్‌ అభిశంసన సమావేశాల నేపథ్యంలో స్వల్పకాలానికి నిఫ్టీ పరిమిత కదలికలు చూపవచ్చని అభిప్రాయపడుతున్నారు. లాంగ్‌ పొజిషన్లున్న ట్రేడర్లు ప్రాఫిట్‌ బుకింగ్‌ చేయవచ్చని, కొంత వెనుకంజ వేసిన

12,200 సమీపంలో నిఫ్టీ ప్రారంభం

Wednesday 18th December 2019

క్రితం రోజు రికార్డు గరిష్టస్థాయిని సృష్టించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం తిరిగి మరో కొత్త రికార్డును నెలకొల్పింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 34 పాయింట్లు పెరిగి 12,199 పాయింట్ల స్థాయిని నిఫ్టీ టచ్‌ చేసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 90 పాయింట్ల లాభంతో 41,442 పాయింట్ల వద్ద మొదలయ్యింది. 

Most from this category