News


తగ్గిన ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు

Friday 2nd August 2019
news_main1564725734.png-27495

న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు మరింత నీరసించాయి. జూలైలో  మొత్తం పీవీ అమ్మకాలు రెండంకెల క్షీణతను నమోదుచేశాయి. హోండా కార్స్‌ ఇండియా విక్రయాలు ఏకంగా 49 శాతం క్షీణించగా.. ఈ విభాగంలో మార్కెట్‌ లీడరైన మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు 36 శాతం తగ్గాయి. అశోక్‌ లేలాండ్‌ విక్రయాలు 29 శాతం పడిపోయాయి. వినియోగదారుల సెంటిమెంట్‌ దెబ్బతిన్న కారణంగా ఆటో రంగం అమ్మకాలు పడిపోతూ వస్తున్నాయని ఎం అండ్‌ ఎం చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా అన్నారు. కొనుగోళ్లు వాయిదా పడిన నేపథ్యంలో విక్రయాలు తగ్గాయని హెచ్‌సీఐఎల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వర్షాకాలం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ డిప్యూటీ ఎండీ ఎన్‌ రాజా అన్నారు.



You may be interested

జూలైలో తయారీ రంగం ఓకే!: పీఐఎం

Friday 2nd August 2019

న్యూఢిల్లీ: తయారీ రంగం జూలైలో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ ఇండెక్స్‌  (పీఎంఐ) 52.5గా నమోదయ్యింది. జూన్‌లో ఈ సూచీ 52.1గా ఉంది. కొత్త ఆర్డర్లు రావడం, ఉత్పత్తి పటిష్టత తాజా సూచీ మెరుగుకు కారణం. కాగా ఈ సూచీ 50 లోపనకు పడిపోతేనే క్షీణతగా భావించడం జరుగుతుంది. లేదంటే, వృద్ధితీరుగానే భావించడం జరుగుతుంది. ఆ లెక్కన వరుసగా 24 నెలల నుంచీ

భారత్‌లో డిమాండ్‌ ‘‘బంగారం‘‘

Friday 2nd August 2019

క్యూ2లో 13 శాతం పెరుగుదల 213 టన్నులుగా నమోదు ఆకర్షణీయ ధరలు, పర్వదినాలతో  పెరిగిన కొనుగోళ్లు ఆర్‌బీఐకి కూడా పసిడి ఆకర్షణ వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక ముంబై: బంగారానికి ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో (క్యూ2) దేశంలో మంచి డిమాండ్‌ నమోదయ్యింది. 2018 ఇదే కాలంతో పోల్చితే డిమాండ్‌ 13 శాతం పెరిగి 213 టన్నులకు చేరింది. సంబంధిత మూడు నెలల్లో పర్వదినాలు, అలాగే ఆకర్షణీయమైన ధరలు పసిడి కొనుగోళ్లను పెంచినట్లు వరల్డ్‌ గోల్డ్‌ ‍కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తన తాజా

Most from this category