News


జూలైలో తయారీ రంగం ఓకే!: పీఐఎం

Friday 2nd August 2019
news_main1564726149.png-27496

న్యూఢిల్లీ: తయారీ రంగం జూలైలో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ ఇండెక్స్‌  (పీఎంఐ) 52.5గా నమోదయ్యింది. జూన్‌లో ఈ సూచీ 52.1గా ఉంది. కొత్త ఆర్డర్లు రావడం, ఉత్పత్తి పటిష్టత తాజా సూచీ మెరుగుకు కారణం. కాగా ఈ సూచీ 50 లోపనకు పడిపోతేనే క్షీణతగా భావించడం జరుగుతుంది. లేదంటే, వృద్ధితీరుగానే భావించడం జరుగుతుంది. ఆ లెక్కన వరుసగా 24 నెలల నుంచీ తయారీ సూచీ వృద్ధి బాటలోనే ఉంటోంది. ఆగస్టు 5, 6,7 తేదీల్లో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. 



You may be interested

18 పైసలు క్షీణించి..69.24 వద్ద రూపీ

Friday 2nd August 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతోపాటు, బ్యాంకులు, దిగుమతిదారులు యుఎస్‌ కరెన్సీ డాలర్‌ను కొనుగోలు చేయడంతో రూపీ డాలర్‌ మారకంలో 18 పైసలు క్షీణించి శుక్రవారం(అగష్టు 02) ట్రేడింగ్‌లో 69.24 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 27 పైసలు క్షీణించి 69.06 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఫెడరల్ రిజర్వ్ 25 బిపిఎస్ రేట్ల కోత చేసినప్పటికి ఈ రేట్ల కోత కొనసాగదని స్పష్టమైన

తగ్గిన ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు

Friday 2nd August 2019

న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్ వాహన (పీవీ) విక్రయాలు మరింత నీరసించాయి. జూలైలో  మొత్తం పీవీ అమ్మకాలు రెండంకెల క్షీణతను నమోదుచేశాయి. హోండా కార్స్‌ ఇండియా విక్రయాలు ఏకంగా 49 శాతం క్షీణించగా.. ఈ విభాగంలో మార్కెట్‌ లీడరైన మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు 36 శాతం తగ్గాయి. అశోక్‌ లేలాండ్‌ విక్రయాలు 29 శాతం పడిపోయాయి. వినియోగదారుల సెంటిమెంట్‌ దెబ్బతిన్న కారణంగా ఆటో రంగం అమ్మకాలు పడిపోతూ వస్తున్నాయని ఎం

Most from this category