News


ద్విచక్ర వాహన విక్రయాల్లో రెండంకెల క్షీణత

Saturday 3rd August 2019
news_main1564809322.png-27517

ప్రముఖ దేశీ ద్విచక్ర వాహన కంపెనీల అమ్మకాలు జూలైనెలలో గణనీయంగా పడిపోయాయి. గతనెల్లో 5,35,810 యూనిట్లను విక్రయించిన హీరో మోటోకార్ప్‌.. ఏడాది ప్రాతిపదికన ఏకంగా 21.18 శాతం తగ్గుదలను నమోదుచేసింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకాలు 27 శాతం తగ్గిపోయాయి. ఈ సంస్థ దేశీ విక్రయాలు 49,182 యూనిట్లు కాగా, బజాజ్‌ ఆటో అమ్మకాల్లో 13 శాతం, టీవీఎస్‌ మోటార్‌ విక్రయాల్లో 16 శాతం తగ్గుదల నమోదైంది. మరోవైపు తాజాగా వెల్లడైన ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో.. టాటా మోటార్స్‌ 31 శాతం తగ్గుదలను చూపింది. మొత్తం కంపెనీ అమ్మకాలు 34 శాతం తగ్గుదలతో 32,938 యూనిట్లుగా ప్రకటించింది. ఇక పూణేలో ఈ సంస్థ ఏడు చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేసింది. ఈ ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో 300 చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్‌లలో వీటిని ప్రారంభించనున్నట్లు టాటా మోటార్స్‌ ప్రకటించింది.

రూ.1.58 లక్షలు తగ్గిన ‘కోన’ ధర
హ్యుందాయ్ తాజాగా విడుదలచేసిన తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘కోన’ ధరను రూ.1.58 లక్షలు తగ్గించింది. దీంతో ఈ కారు ధర రూ.23.71 లక్షలకు తగ్గింది. జీఎస్‌టీ తగ్గిన నేపథ్యంలో ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీచేయడంలో భాగంగా ఈ మేరకు ధర తగ్గినట్లు వివరించింది.



You may be interested

ఆర్‌బీఐ నిల్వల బదలాయింపు సరికాదు!

Saturday 3rd August 2019

మాజీ గవర్నర్‌ దువ్వూరి అభిప్రాయం ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందికి ఇది సూచిక తరచూ సావరిన్‌ బాండ్ల జారీ సరికాదు సెంట్రల్‌ బ్యాం‍క్‌ స్వయంప్రతిపత్తి  నిర్వహణ కీలకాంశం ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మిగులు నిల్వల బదలాయింపు జరగాలన్న ధోరణిని మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందికర పరిస్థితులను ఇది ప్రస్ఫుటం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపట్ల అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.3,203 కోట్లు

Saturday 3rd August 2019

46 శాతం వృద్ధి   రూ.12,996 కోట్లకు మొత్తం ఆదాయం న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ. 3,204 కోట్ల నికర లాభం(స్టాండ్‌అలోన్‌) సాధించింది. గత క్యూ1లో ఆర్జించిన నికర లాభం, రూ.2,190 కోట్లుతో పోల్చితే 46 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,952 కోట్ల నుంచి రూ.12,996 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.2,190 కోట్ల నుంచి 43

Most from this category