News


జుబిలంట్‌ లైఫ్‌ లాభం 19 శాతం అప్‌

Saturday 26th October 2019
news_main1572064775.png-29157

  • ఆదాయం రూ.2,266 కోట్లకు 

న్యూఢిల్లీ: జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 19 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.210 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ క్యూ2లో రూ.249 కోట్లకు పెరిగిందని జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ తెలిపింది.  కార్యకలాపాల ఆదాయం రూ.2,269 కోట్ల నుంచి రూ.2,266 కోట్లకు తగ్గిందని కంపెనీ ఎమ్‌డీ హరి ఎస్‌. భర్తియ చెప్పారు. ఆదాయం తగ్గినా, నిర్వహణ లాభాలు మెరుగుపడ్డాయని  పేర్కొన్నారు. 

డీమెర్జ్‌కు బోర్డ్‌ ఆమోదం...
లైఫ్‌ సైన్సెస్‌ ఇన్‌గ్రెడియంట్స్‌ బిజినెస్‌ను విడదీయడానికి(డీమెర్జ్‌)  కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ప్రమోటర్‌ షేర్‌హోల్డింగ్‌ కంపెనీలన్నింటినీ జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌లో విలీనం చేసే ప్రతిపాదనను  కూడా డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించింది. 



You may be interested

అర్‌వింద్‌ లాభం రూ.50 కోట్లు

Saturday 26th October 2019

రూ.1,962 కోట్లకు మొత్తం అమ్మకాలు  న్యూఢిల్లీ: టెక్స్‌టైల్స్‌ దిగ్గజం అర్‌వింద్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.50 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.56 కోట్ల నికర లాభం ఆర్జించామని అర్‌వింద్‌ కంపెనీ తెలిపింది. నికర అమ్మకాలు ఈ క్యూ2లో రూ.1,962 కోట్లుగా ఉండగా, గత క్యూ2లో రూ.1,793 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఈ కంపెనీ నుంచి బ్రాండెడ్‌ దుస్తుల విభాగం

దీపావళి ధమాకా షేర్లు!

Saturday 26th October 2019

- కొన్నిటి జోలికెళితే పేలుతాయి జాగ్రత్త - ఐటీ, ఫార్మా, పీఎస్‌యూలకు దూరం.. - ప్రైవేట్‌ బ్యాంకులు, బీమా సంస్థలు ఆకర్షణీయం - బ్రోకరేజి సంస్థల సిఫారసులు ‘సాక్షి’కి ప్రత్యేకం... గత దీపావళి నుంచి మిగతా రంగాలతో పోలిస్తే రియల్టీ, బ్యాంకింగ్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల సూచీలు మెరుగ్గా రాణించగా.. మెటల్, ఆటో, హెల్త్‌కేర్‌ వెనుకబడ్డాయి. రియల్టీ 14 శాతం, బ్యాంకెక్స్‌ 13 శాతం, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ 13 శాతం పెరిగాయి. ఇక

Most from this category