STOCKS

News


జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌కు ఆన్‌లైన్‌ జోష్‌

Thursday 30th January 2020
news_main1580358258.png-31323

  •  14 శాతం పెరిగిన ఆదాయం  
  • 7 శాతం వృద్ధితో రూ.104 కోట్లకు నికర లాభం 

న్యూఢిల్లీ: డొమినోస్‌  పిజ్జా, డంకిన్‌ డునట్స్‌ చెయిన్లను నిర్వహించే జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.104 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌)ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో వచ్చిన నికర లాభం రూ.97 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.929 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.1,060 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఆన్‌లైన్‌ సేల్స్‌ జోరుగా ఉండటం వల్ల ఆదాయం ఈ స్థాయిలో పెరిగిందని పేర్కొంది. 

మసాలా పిజ్జాకు మంచి ఆదరణ...
ఈ క్యూ3లో అందుబాటులోకి తెచ్చిన మసాలా పిజ్జా కూడా మంచి అమ్మకాలు సాధించిందని కంపెనీ చైర్మన్‌ శ్యామ్‌ ఎస్‌. భాటియా తెలిపారు. ఈ క్యూ3లో 44 డొమినోస్‌ పిజ్జా, 2 డంకిన్‌ డునట్స్‌, ఒకటి హాంగ్స్‌కిచెన్‌-మొత్తం 47 స్టోర్స్‌ను కొత్తగా ప్రారంభించామని పేర్కొన్నారు.  ఒక త్రైమాసిక కాలంలో ఇన్నేసి స్టోర్లను ఏర్పాటు చేయడం గత ఐదేళ్లలో ఇదే మొదటిసారని వివరించారు. You may be interested

ఆర్‌ఐఎల్‌ డౌన్‌గ్రేడ్‌-మెక్వ్యరీ

Thursday 30th January 2020

నేలచూపులతో ప్రారంభమైన రిలయన్స్‌ షేరు నష్టాలతో కదులుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు విదేశీ రీసెర్చ్‌ సంస్థ మెక్వ్యరీ తాజాగా పేర్కొంది. రూ. 1300 టార్గెట్‌ ధరను కొనసాగిస్తున్నట్లు తెలియజేసింది. కాగా.. కరోనా వైరస్‌ జపాన్‌కూ చేరిన వార్తలతో ప్రస్తుతం ఆసియా మార్కెట్లు డీలా పడ్డాయి. నేడు సమావేశంకానున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా వైరస్‌పై గ్లోబల్‌ ఎమర్జెన్సీను ప్రకటించన్నుట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో దేశీ

మార్కెట్లోకి బీఎస్‌-6 హోండా ‘అమేజ్‌’

Thursday 30th January 2020

 ప్రారంభ ధర రూ.6.09 లక్షలు  న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్‌ ఇండియా’ (హెచ్‌సీఐఎల్‌).. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఎంట్రీ లెవెల్‌ కాంపాక్ట్‌ సెడాన్‌ ‘అమేజ్‌’ కారును బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 1.2 లీటర్‌ పెట్రోల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.6.09 లక్షలు – 8.75 లక్షలుగా ఉంది. ఈ వేరియంట్లో మాన్యువల్‌ లీటరకు 18.6 కిలోమీటర్ల మైలేజీని, సీవీటీ వేరియంట్‌ 18.3

Most from this category