News


బీఎస్‌ఈ బాండ్స్‌ వేదికపై జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ సీపీ

Thursday 19th December 2019
news_main1576730162.png-30306

మరో నాలుగు కంపెనీల కమర్షియల్‌ పేపర్స్‌ కూడా

న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కంపెనీ తన కమర్షియల్‌ పేపర్స్‌ను (సీపీ) బీఎస్‌ఈ బాండ్స్‌ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్‌ చేయాలని బీఎస్‌ఈకి దరఖాస్తు చేసుకుంది. ఈ కంపెనీతో పాటు ఆదిత్య బిర్లా ఫైనాన్స్, కేఈసీ ఇంటర్నేషనల్, ఆదిత్య బిర్లా మనీ, ఫుల్లర్టన్‌ ఇండియా క్రెడిట్‌.. మొత్తం  ఐదు కంపెనీలు సీపీ లిస్టింగ్‌ కోసం దరఖాస్తు చేశాయి. గురువారం ఈ కంపెనీల కమర్షియల్‌ పేపర్స్‌ను లిస్ట్‌ చేస్తామని బీఎస్‌ఈ పేర్కొంది. ఈ కంపెనీలతో కలుపుకుంటే బీఎస్‌ఈ బాండ్స్‌ ప్లాట్‌ఫామ్‌పై కమర్షియల్‌ పేపర్స్‌ను లిస్ట్‌ చేసిన కంపెనీల సంఖ్య 16కు పెరుగుతుంది. ఈ కమర్షియల్‌ పేపర్స్‌ ద్వారా కంపెనీలు రూ.17,835 కోట్లు సమీకరించాయి.

కమర్షియల్‌ పేపర్స్‌ అంటే...  
పెద్ద పెద్ద కంపెనీలు తమ స్వల్పకాలిక రుణాల కోసం ప్రామిసరీ నోట్ల రూపంలో జారీ చేసే మనీ మార్కెట్‌ సాధనంగా కమర్షియల్‌ పేపర్స్‌ను చెప్పుకోవచ్చు. వీటి మెచ్యురిటీ కాలం జారీ చేసిన తేదీ నుంచి కనిష్టంగా ఏడు రోజులు గరిష్టంగా ఏడాది కాలం ఉంటుంది. ముఖ విలువ కంటే కొంచెం డిస్కౌంట్‌కు వీటిని జారీ చేస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్‌ వడ్డీరేట్లు వర్తిస్తాయి. 



You may be interested

టెక్నాలజీతోనే నిర్మాణ వ్యయం తగ్గుతుంది

Thursday 19th December 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ, డేటా అనలిటిక్ట్స్‌ వినియోగంతో నిర్మాణ, మార్కెటింగ్‌ వ్యయం తగ్గుతుందని నిర్మాణ రంగ ప్రముఖులు వ్యాఖ్యానించారు. సీఐఐ–సీబీఆర్‌ఈ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జరిగిన ‘ఛేంజింగ్‌ డైనమిక్స్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇండస్ట్రీ’ సదస్సులో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏటీఎస్‌ గ్రూప్‌ సీఎండీ గీతాంబర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ.. నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో డెవలపర్లు తమ ఆలోచన తీరును మార్చుకోవాలన్నారు. డేటా అనలిటిక్స్‌ వినియోగంతో మార్కెటింగ్‌

ఐడీబీఐ బ్యాంక్‌తో లావాదేవీలపై భయం వద్దు!

Thursday 19th December 2019

అది ప్రభుత్వానిదే; పూర్తి సామర్థ్యం ఉంది ఆర్థికశాఖ భరోసా   ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు డిపాజిట్లను ఉపసంహరిస్తుండటం... కొత్త డిపాజిట్లు చేయకపోవటం వంటి వ్యవహారాలపై ఆర్థికశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుతో లావాదేవీల నిర్వహణ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఒక లేఖ రాసింది. ఎప్పటిలాగే బ్యాంకింగ్‌ సేవలు అందించడానికి ఐడీబీఐ బ్యాంక్‌కు

Most from this category