News


జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చేతికి జీఎమ్‌ఆర్‌ కమళంగ ఎనర్జీ

Tuesday 18th February 2020
news_main1581995939.png-31874

  • డీల్‌ విలువ రూ.5,321 కోట్లు

 న్యూఢిల్లీ: జీఎమ్‌ఆర్‌ ఎనర్జీకి చెందిన ఒడిషాలోని 1,050 మెగావాట్ల  థర్మల్‌ పవర్‌​ ప్లాంట్‌ను సజ్జన్‌ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కొనుగోలు చేయనుంది. డీల్‌ విలువ రూ.5,321 కోట్లు. ఒడిశాలోని ఈ ప్లాంట్‌ను నిర్వహించే జీఎమ్‌ఆర్‌ ఎనర్జీకి చెందిన జీఎమ్‌ఆర్‌ కమళంగ ఎనర్జీ లిమిటెడ్‌లో వంద శాతం వాటాను కొనుగోలు చేయడానికి షేర్‌ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తెలిపింది. ఈ ప్లాంట్‌ కొనుగోలుతో తమ మొత్తం స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 5,609 మెగావాట్లకు చేరుతుందని పేర్కొంది. ఈ ప్లాంట్ కొనుగోలుతో  దేశపు తూర్పు ప్రాంతంలోకి విస్తరిస్తామని వివరించింది. కాగా ఈ కొనుగోలుకు వివిధ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉంది. ఈ ప్లాంట్‌ టేకోవర్ పూర్తయితే, జేఎస్‌డబ్ల్యూకి వంద శాతం అనుబంధ సం‍స్థగా జీఎమ్‌ఆర్‌ కమళంగ ఎనర్జీ లిమిటెడ్‌(జీకేఈఎల్‌) మారుతుంది. 



You may be interested

రూ.300 కోట్లతో బీఈ కొత్త ప్లాంటు

Tuesday 18th February 2020

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ రంగ సంస్థ బయాలాజికల్-ఇ (బీఈ) లిమిటెడ్‌ హైదరాబాద్‌ సమీపంలోని శామీర్‌పేట వద్ద ఉన్న జీనోమ్‌ వ్యాలీ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌లో కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఈ కేంద్రాన్ని సోమవారమిక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ రూపొందించిన టైఫాయిడ్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను ఆయన ఆవిష్కరించారు. 2017 బయో ఆసియా కార్యక్రమం సందర్భంగా ఈ

ఈ సారి సాఫీగా ఎయిర్‌ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌

Tuesday 18th February 2020

ఎలాంటి ఇబ్బందులు ఉండవు  విమానయాన శాఖ మంత్రి భరోసా న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా వాటా విక్రయం ఈ సారి సాఫీగా జరిగిపోనున్నదని విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి ధీమా వ్యక్తం చేశారు. ఎయిర్‌ ఇండియా కొనుగోలు కోసం సత్తా గల కంపెనీలు మరింత ఆసక్తిగా ఉన్నాయని చెప్పారాయన. అందుకని ఎయిర్‌ ఇండియా వాటా విక్రయం విషయంలో ఈసారి ఎలాంటి సమస్యలు తలెత్తబోవన్నారు. భవిష్యత్తులో కూడా ఒక బ్రాండ్‌గా ఎయిర్‌ ఇండియా

Most from this category