News


పెయింట్స్‌ విభాగంలోకి జేఎస్‌డబ్ల్యు

Thursday 17th October 2019
news_main1571285219.png-28940

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- వ్యాపార దిగ్గజం జేఎస్‌డబ్ల్యు గ్రూప్‌ పెయింట్స్‌ విభాగంలోకి ప్రవేశించింది. మహారాష్ట్రలో కాయిల్‌ కోటింగ్స్‌ ప్లాంటు, కర్నాటకలో వాటర్‌ బేస్డ్‌ డెకొరేటివ్‌ పెయింట్స్‌ యూనిట్‌ నెలకొల్పింది. వీటి కోసం రూ.600 కోట్లు ఖర్చు చేస్తోంది. రెండు కేంద్రాల వార్షిక సామర్థ్యం 12.5 కోట్ల లీటర్లు. ముందుగా దక్షిణ, పశ్చిమ భారత్‌లో విస్తరిస్తామని జేఎస్‌డబ్ల్యు పెయింట్స్‌ జేఎండీ ఎ.ఎస్‌.సుందరేశన్‌ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘2022 నాటికి దేశవ్యాప్తంగా అడుగు పెడతాం. ఆ సమయానికి పూర్తి సామర్థ్యానికి చేరుకోగలం. మూడేళ్లలో వార్షిక టర్నోవర్‌ రూ.2,000 కోట్లు ఆశిస్తున్నాం. తద్వారా 5 శాతం మార్కెట్‌ వాటా చేజిక్కించుకుంటాం. వచ్చే అయిదేళ్లలో 10 శాతం లక్ష్యంగా చేసుకున్నాం. డెకోరేటివ్‌ పెయింట్స్‌ పూర్తిగా వాటర్‌ బేస్డ్‌ కలర్స్‌ ఉంటాయి. ఏ రంగు అయినా ఒకే ధర ఉంటుంది’ అని వివరించారు.



You may be interested

ఫోన్‌తోనూ ఎన్‌ఎఫ్‌సీ చెల్లింపులు: ఎస్‌బీఐ కార్డ్‌

Thursday 17th October 2019

న్యూఢిల్లీ: పాయింట్ ఆఫ్ సేల్స్ (పీవోఎస్‌) టెర్మినల్స్‌లో మొబైల్ ఫోన్ ద్వారా సులభతరంగా చెల్లింపులు చేసే సదుపాయాన్ని ఎస్‌బీఐ కార్డ్ అందుబాటులోకి తెచ్చింది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీని ఉపయోగించే ఈ విధానంలో.. పీవోఎస్‌ మెషీన్‌పై మొబైల్ ఫోన్‌ను ఒకసారి తాకిస్తే చాలు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయొచ్చని సంస్థ తెలిపింది. ప్రత్యేకంగా క్రెడిట్ కార్డు వెంట ఉండక్కర్లేదని, పిన్‌ నంబరు బాదరబందీ ఉండదని పేర్కొంది. సాధారణంగా ఇలాంటి

హావెల్స్‌ స్మార్ట్‌ స్విచ్‌ గేర్స్‌

Thursday 17th October 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ఎలక్ట్రికల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ హావెల్స్‌ ఇండియా స్టడెక్స్‌ పేరుతో స్మార్ట్‌ స్విచ్‌ గేర్స్‌ను ప్రవేశపెట్టింది. మినియేచర్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌ (ఎంసీబీ), డిస్ట్రిబ్యూషన్‌ బోర్డ్‌ సాంకేతికంగా అత్యాధునికమైనవని హావెల్స్‌ ప్రెసిడెంట్‌ సౌరభ్‌ గోయల్‌ తెలిపారు. ఏపీ, తెలంగాణ బిజినెస్‌ హెడ్‌ మహేందర్‌ వల్లకాటితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వీటితో నిర్వహణ సమస్యలు ఉండవు. గృహ, కార్యాలయాల్లో పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా రూపొందించాం. స్టడెక్స్‌లో

Most from this category