News


జేఎస్‌పీఎల్‌ నష్టాలు రూ.87 కోట్లు

Thursday 15th August 2019
news_main1565851686.png-27779

గత క్యూ1 లాభం రూ.110 కోట్లు 
-మొత్తం ఆదాయం రూ.9,946 కోట్లు 
-10 శాతం పెరిగిన షేరు 

న్యూఢిల్లీ: జిందాల్‌​ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌ (జేఎస్‌పీఎల్‌) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.87 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ1లో రూ.110 కోట్ల నికర లాభం ఆర్జించామని జేఎస్‌పీఎల్‌ తెలిపింది. వ్యయాలు బాగా పెరగడంతో ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. గత క్యూ1లో రూ.9,665 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.9,946 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.9,400 కోట్ల నుంచి రూ.9,935 కోట్లకు పెరిగాయని తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి ఈ క్యూ1లో 12 శాతం వృద్ధితో 1.85 మిలియన్‌ టన్నులకు పెరిగిందని జేఎస్‌పీఎల్‌ తెలిపింది. ముడి ఉక్కు విక్రయాలు 14 శాతం వృద్ధితో 1.84 మిలియన్‌ టన్నులకు పెరిగాయని పేర్కొంది. ఉక్కు తయారీలో కీలకమైన ఇనుప ఖనిజం ధరలు పెరిగినా, ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ ‍క్వార్టర్‌లో ఉక్కు ధరలు తగ్గాయని వివరించింది. భారత్‌లో వివిధ ఉక్కు ఉత్పత్తులకు డిమాండ్‌ అంతంతమాత్రంగానే ఉందని, ఫలితంగా ధరలు పడిపోయాయని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి మొత్తం రుణ భారం రూ.39,000 కోట్లని వివరించింది. నిర్వహణ లాభం 5 శాతం తగ్గ ఇరూ.2,173 కోట్లకు చేరిందని, మార్జిన్‌ 1.8 శాతం తగ్గి 21.8 శాతానికి చేరిందని తెలిపింది. అంచనాల కంటే తక్కువగానే నష్టాలు రావడంతో  ఈ షేర్‌ భారీగా లాభపడింది. బీఎస్‌ఈలో జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ షేర్‌ 9.5 శాతం లాభంతో రూ.103 వద్ద ముగిసింది. 


 



You may be interested

ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌కు రూ.119 కోట్ల నష్టాలు

Thursday 15th August 2019

న్యూఢిల్లీ:  ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌ (ఐబీఆర్‌ఈఎల్‌) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో రూ.119 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ1లో రూ.117 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.835 కోట్ల నుంచి రూ.869 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఆదాయం అధికంగా ఉన్నప్పటికీ, రూ.68 కోట్ల వడ్డీ భారం, రూ.98 కోట్ల అదనపు పన్ను భారం కారణంగా నికర నష్టాలు వచ్చాయని వివరించింది. ఈ ఆర్థిక

ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టకాలం..

Thursday 15th August 2019

జూన్‌లో మూడేళ్ల కనిష్టానికి రుణ వృద్ధి ఆటో, రియల్టీ తదితర రంగాల్లో డిమాండ్‌ తగ్గడం కారణం కష్టతరంగా మారిన నిధుల సమీకరణ సదరు సంస్థల ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం న్యూఢిల్లీ: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు చాలా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయి. ఇటు రుణాలకు డిమాండ్‌ తగ్గి అటు నిధుల సమీకరణ కష్టతరంగా మారడంతో జూన్‌ త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీల రుణ మంజూరు వృద్ధి రేటు గణనీయంగా క్షీణించి ఉంటుందన్న అంచనాలు నెలకొన్నాయి. మూడేళ్ల కనిష్ట స్థాయికి

Most from this category