News


జేఎస్‌పీఎల్‌ నష్టాలు రూ.399 కోట్లు

Wednesday 6th November 2019
news_main1573013114.png-29388

  • రూ.8,940 కోట్లకు తగ్గిన ఆదాయం 

న్యూఢిల్లీ: జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌(జేఎస్‌పీఎల్‌) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.399 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.279 కోట్ల నికర లాభం వచ్చిందని జేఎస్‌పీఎల్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,983 కోట్ల నుంచి రూ.8,940 కోట్లకు తగ్గిందని పేర్కొంది.  ధరలు, లాభదాయకత బాగా తగ్గినా, రెయిల్స్‌, ప్లేట్స్‌ వంటి విభిన్నమైన విలువాధారిత ఉత్పత్తుల తోడ్పాటుతో ఒకింత ఊరట లభించిందని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి  రుణ భారం రూ.36,501 కోట్లుగా ఉందని పేర్కొంది. 



You may be interested

నేడు క్యూ2 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు

Wednesday 6th November 2019

కెనరా బ్యాంక్‌, టాటా స్టీల్‌, లుపిన్‌, సిప్లా, ఓల్టాస్‌, బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌, గోద్రేజ్‌ కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఈఐడీ ప్యారీ, మణప్పురం ఫైనాన్స్‌, పీఎన్‌బీ గిల్ట్స్‌, ర్యాడికో ఖైతాన్‌, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, వి-గార్డ్‌ ఇండస్ట్రీస్‌  తదితర కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

ఆర్‌ఈసీ లాభం 24 శాతం డౌన్‌

Wednesday 6th November 2019

రూ.7,484 కోట్లకు ఆదాయం  3 లక్షల కోట్లు దాటిన లోన్‌బుక్‌  న్యూఢిల్లీ:- ప్రభుత్వ రంగ ఆర్‌ఈసీ కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 24 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.1,733 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,322 కోట్లకు తగ్గిందని ఆర్‌ఈసీ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.6,246 కోట్ల నుంచి రూ.7,484 కోట్లకు పెరిగిందని పేర్కొంది. విద్యుత్‌ రంగంలో సెంటిమెంట్స్‌ మెరుగుపడుతున్నాయని కంపెనీ

Most from this category