News


వచ్చే ఏడాది రూ.3,000 కోట్ల ఆదాయం

Wednesday 29th January 2020
news_main1580272344.png-31285

  • జాన్సన్‌ లిఫ్ట్స్, ఎస్కలేటర్స్‌ వెల్లడి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: లిఫ్ట్స్‌, ఎస్కలేటర్స్‌ తయారీ సంస్థ జాన్సన్‌.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.3,000 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా చేసుకుంది. 2018-19లో  రూ.2,000 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశామని కంట్రీ హెడ్‌ ఆల్‌బర్ట్‌ ధీరవియం తెలిపారు. నూతన మోడళ్లను ఇక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా  బిజినెస్‌ హెడ్‌ అలోక్‌ గుప్తా, జీఎం చైతన్యతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి ఏటా 65,000 లిఫ్టులు, 2,500 ఎస్కలేటర్లు అమ్ముడవుతున్నాయి. మార్కెట్‌ లీడర్‌గా ఉన్న కంపెనీకి ఈ విభాగాల్లో వరుసగా 22 శాతం, 48 శాతం వాటా ఉంది. మొత్తం పరిశ్రమలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ 18 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. విక్రయాల పరంగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలు తొలి స్థానానికి చేరుకుంటాయి’ అని వివరించారు. 



You may be interested

ఫిబ్రవరిలో భారత్‌కు ట్రంప్‌!

Wednesday 29th January 2020

భారీ ట్రేడ్‌ డీల్‌ కుదిరే అవకాశం దాదాపు రూ.71వేల కోట్ల విలువైన మెగా ట్రేడ్‌ డీల్‌ భారత్‌, యూఎస్‌ మధ్య వచ్చే నెల కుదరనుంది. ఫిబ్రవరిలో యునైటెడ్‌ స్టేట్స్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్(యూఎస్‌టీఆర్‌) రాబర్ట్‌ లైట్జర్‌ భారత్‌కు రానున్నారు. భారత సందర్శనలో రాబర్ట్‌ ట్రేడ్‌డీల్‌ను ఖరారు చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంతరం ఫిబ్రవరిలోనే భారత్‌కు వచ్చే ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పర్యటనలో డీల్‌పై సంతకాలు జరుగుతాయని తెలిపాయి. ఫిబ్రవరి రెండో వారంలో రాబర్ట్‌,

ఆరోగ్యానికి రూ.1.50లక్షల కోట్లు అవసరం

Wednesday 29th January 2020

ఆరోగ్య సేవలకు రూ.1,50,000 కోట్లు కేటాయించాలి పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలపై పన్ను ప్రయోజనాలను రానున్న బడ్జెట్‌లో తిరిగి పునరుద్ధరించాలని భారత ఔషధ పరిశ్రమ ఆశిస్తోంది. దేశంలో ఆవిష్కరణలను పెంచాలంటే 2010 బడ్జెట్‌లో ఇచ్చినట్టుగా 200 శాతం వెయిటెడ్‌ ట్యాక్స్‌ డిడక్షన్‌ ఇవ్వాలని ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ అలయన్స్‌ (ఐపీఏ) సెక్రటరీ జనరల్‌ సుదర్శన్‌ జైన్‌ ప్రభుత్వాన్ని కోరారు. సగటున కంపెనీలు ఆర్‌అండ్‌డీపై 2012లో 5.3 శాతం వెచ్చిస్తే, గత ఆర్థిక

Most from this category